Advertisement
Google Ads BL

సడన్ సర్ ప్రైజ్ ఇచ్చిన హైపర్ ఆది


గత రెండు వారాలుగా ఢీ డాన్స్ షో అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపర్ ఆది కనిపించడం లేదు. ఆది ఏం బిజీ ఉండి మిస్ అయ్యాడో కానీ.. హైపర్ ఆది అభిమానులు మాత్రం రెండు వారాలకే బెంగ పెట్టుకున్నారు. అయితే ఈ బుధవారం జరిగిన ఢీ డాన్స్ షో లో హైపర్ ఆది స్టార్టింగ్ లో కనిపించకుండా.. షో లాస్ట్ లో ఎంట్రీ ఇచ్చాడు. పిల్లలతో కలిసి డాన్స్ స్టెప్స్ వేస్తూ సందడి చేసాడు. ఆది పంచ్ లు మిస్ అయినా.. ఈవారం ఆది సడన్ సర్ ప్రైజ్ మాత్రం ఫాన్స్ కి పూనకాలు తెప్పించింది. కానీ బిగ్ బాస్ అఖిల్ మాత్రం దేవుడా.. నేను ఇప్పటివరకు హ్యాపీ గా ఉన్నాను.. ఇప్పుడేమో ఆది వచ్చేసాడు అనగానే.. ప్రదీప్ నిజమే నిన్ను ఏడిపించే మొగుడు ఎంట్రీ ఇవ్వగానే అఖిల్ ఫేస్ మాడిపోయింది అన్నాడు.

Advertisement
CJ Advs

ఇక వచ్చే వారం ఎప్పటిలాగే హైపర్ ఆది తన పంచ్ లతో అఖిల్ కి మిగతా వారికి చమటలు పట్టించేసిన ప్రోమో వైరల్ అయ్యింది. కామెడీ తో డాన్స్ షో లో ఉత్సాహం తెప్పించాడు. అలాగే మరో షో శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా అది ఎంట్రీ ఇచ్చాడు  వచ్చే ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆది కామెడీ జస్ట్ ప్రమోలోనే అదిరింది. వచ్చే ఆదివారం మహిళా దినోత్సవ స్పెషల్ గా.. కంటెస్టెంట్స్ తమ తల్లులని తీసుకొచ్చి పాదాభిషేకం చేస్తున్నారు. అందులో సుజాత కామెడీ చేయబోతే అమ్మ నువ్వు రాకేష్ ఫింగర్ లో రింగు పెట్టు కానీ.. ఈ కామెడీలో ఎంట్రీ ఇవ్వకు అంటూ ఆది వేసే పంచెస్ ఆకట్టుకునేలా ఉండగా.. హైపర్ ఆది ఫాన్స్ మాత్రం ఆది ఎంట్రీ తో పండగ చేసుకుంటున్నారు. 

Hyper Aadi entry in Dhee Dance Show Today Episode:

Hyper Aadi entry promos
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs