ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ మార్చ్ 11 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. మేకర్స్ రాధే శ్యామ్ సెకండ్ ట్రైలర్ తో నే ప్రమోషన్స్ హడావిడి ముంబై వేదికగా మొదలు పెట్టేసారు. నేడు ప్రభాస్ - పూజ హెగ్డే రాధే శ్యామ్ మేకర్స్ ముంబై లో రాధేశ్యామ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని వినూత్నంగా మొదలు పెట్టారు. సెకండ్ ట్రైలర్ నిడివి ఒక్క నిమిషమే.. అయినా అందులో ఎంతో ప్రేమ, రొమాన్స్, ఎమోషన్స్ అన్ని కనిపిస్తున్నాయి. ప్రభాస్ విక్రమాదిత్యగా ఆస్ట్రాలజర్ కేరెక్టర్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో కృష్ణం రాజు, జగపతి బాబు లాంటి నటులు కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
కాకపోతే ఈ సినిమాలో విలన్ అనే కేరెక్టర్ లేదంటున్నారు. కేవలం విధికి - ప్రేమకి జరిగే యుద్ధంగా సినిమాని రాధా కృష్ణ మలిచినట్లుగా రెండు ట్రైలర్స్ లోను చూపించారు. ఇటలీ ట్రైన్ ఎపిసోడ్ అలాగే భారీ విజువల్ ఎఫెక్ట్స్, క్లైమాక్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని.. సినిమా చాలా బాగా వచ్చింది అని.. రాధే శ్యామ్ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమనే మాట మీడియా సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి రాధే శ్యామ్ బ్లాక్ బస్టర్ అవుతుందో.. లేదో.. తెలియాలంటే మరో పది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.