Advertisement
Google Ads BL

కరోనాతో నీరసించిపోయిన శృతి


కరోనా వచ్చింది అంటే.. జ్వరం, కోల్డ్, దగ్గు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అదే అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కరోనా సోకితే ప్రాణం పోయే పరిస్థితిని తీవసుకుని వచ్చింది కరోనా. రీసెంట్ గా హీరోయిన్ శృతి హాసన్ కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్ లో రెస్ట్ తీసుకుంది. తనకి కరోనా సోకినట్లుగా సోషల్ మీడియా ద్వారా తెలియపరిచిన శృతి హాసన్ తాజాగా తన హెల్త్ అప్ డేట్ ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది. తాను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. కరోనా సోకింది అని.. ప్రస్తుతం తన ఐసోలేషన్ కష్టాలను ఏకరువు పెట్టింది. 

Advertisement
CJ Advs

కరోనాతో చాలా వీక్ అవడమే కాదు, నీరసించిపోయాను. ఏం చేయాలో తెలియడం లేదు అంటూ పోస్ట్ చెయ్యడంతో శృతి హాసన్ అభిమానులు కలవరపడుతున్నారు. ఈమధ్యనే సినిమాల్లోకి కం బ్యాక్ అయ్యి వరస హిట్స్ కొడుతున్న శృతి హాసన్ కరోనా తో వీక్ అయితే కష్టం కదా.. ముందు యోగ, ఎక్సర్ సైజ్ లు చెయ్యండి. తొందరగా కోలుకుంటారు. ఎందుకంటే తర్వాత సలార్ షూట్ లో పాల్గొనాలి, బాలకృష్ణ NBK 107 షూటింగ్ కి హాజరవ్వాలి ఇలా నీరసపడితే ఎలా పాపా అంటూ దిగాలు పడుతున్నవారికి.. మీ అందరి ఆశీస్సులతో త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తాను అంటూ చెప్పి ఫాన్స్ ని కూల్ చేసింది. 

Shruthi Haasan Health Update:

Shruthi Haasan gets Covid Shock
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs