Advertisement
Google Ads BL

రాధే శ్యామ్: ప్రేమకి విధికి మధ్య జరిగే యుద్ధమే


ఫాన్స్ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెడుతూ ప్రభాస్ రాధే శ్యామ్ ప్రమోషన్స్ లోకి దిగిపోయారు. మార్చ్ 11 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న రాధే శ్యామ్ సెకండ్ ట్రైలర్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్. జనవరి లో రావాల్సిన రాధే శ్యామ్ అనివార్య కారణాలతో మార్చి 11 కి షిఫ్ట్ అవడంతో ఫాన్స్ నిరాశ చెందినా.. మళ్లీ రాధే శ్యామ్ టైం స్టార్ట్ అవడంతో.. సోషల్ మీడియాలో రాధే శ్యామ్ ని ట్రెండ్ చేస్తూ రచ్చ మొదలు పెట్టేసారు. గత రెండు రోజు లుగా ఈ రోజు 3 గంటలకి 1 నిమిషం నిడివితో ట్రైలర్ ని ఇవ్వబోతున్నామా అంటూ మేకర్స్ ఆసక్తిని రేకెత్తించారు. నేడు ముంబై వేదికగా ఐదు భాషల్లో రాధే శ్యామ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్, పూజ హెగ్డే పాల్గొన్నారు.

Advertisement
CJ Advs

రాధే శ్యామ్ ఫస్ట్ ట్రైలర్ లో ప్రభాస్ విక్రమాదిత్యగా, పూజ ప్రేరణని లవ్ చెయ్యడం, ఆయన వృత్తి, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ని చూసిన వారికి.. మరొక ట్రైలర్ లో.. మనం ఆలోచిస్తున్నామని భ్రమపడతాం. కానీ మన ఆలోచనలు కూడా ముందే రాసుంటాయ్ అంటూ ఆస్ట్రాలజర్ లా ప్రభాస్ వాయిస్ తో మొదలైన ట్రైలర్ లో.. చెయ్యి చూసి ఫ్యూచర్ ని, వాయిస్ విని పాస్ ని కూడా చెప్పేస్తావా అంటూ చెయ్యి చాచిన వ్యక్తికి జాతకం చెప్పినప్పుడు ప్రభాస్ లుక్స్, అలాగే ఎవరు ఎప్పుడు చనిపోతారో అంటూ చెప్పి చిక్కుల్లో పడే వ్యక్తిగా ప్రభాస్ ఎమోషనల్ గా కనిపించగా.. పూజ హెగ్డే ఎప్పటిలాగే గ్లామర్ గా కనిపించింది. ఇక ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్న జగపతి బాబు తన జాతకం మరోసారి చెప్పమనగానే.. నాకు ఏది రెండోసారి చెప్పే అలవాటు లేదని ప్రభాస్ చెప్పే డైలాగ్ ఫాన్స్ కి కిక్కిచ్చేదిలా ఉంది.

ఆస్ట్రాలజర్ లా అందరి తలరాతలను ముందే పసిగట్టే ప్రభాస్ లోని మానసిక సంఘర్షణ, ప్రేమకి విధికి మధ్య జరిగే యుద్ధమే.. రాధేశ్యామ్ అంటూ మరోసారి కథని రివీల్ అవ్వకుండా జాగ్రత్తపడ్డారు మేకర్స్. మధ్యలో ట్రైన్ సీన్, అలాగే విజువల్ ఎఫెక్ట్స్ అన్ని అద్భుతంగా అనిపిస్తున్నాయి.

Radhe Shyam Second Trailer Review:

Prabhas - Pooja Hegde Radhe Shyam Second Trailer Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs