Advertisement
Google Ads BL

ఢీ షో లో ఆది కూడా కనిపించడం లేదు


ఢీ డాన్స్ షో నుండి సుధీర్ - రష్మీ జోడి వెళ్ళాక ఆ స్టేజ్ పై ఫన్ మిస్ అయ్యింది అని, సుధీర్ లేకపోవడం ఢీ కి పెద్ద లోటు అంటూ సుధీర్ ఫాన్స్ చాలా ఫీలయ్యారు. ఢీ 14 సీజన్ లో ఆది, బిగ్ బాస్ అఖిల్, రవికృష్ణ, నవ్య స్వామి లు యాంకర్స్ గా కనిపిస్తున్నారు. ఆది, యాంకర్ ప్రదీప్ చేసే కామెడీ హైలెట్ అవుతుంది ఆ షో లో. జానీ మాస్టర్, ప్రియమణి, నందిత స్వేతలు కూడా జేడ్జ్ లు ఫన్ జెనెరేట్ చేస్తున్నారు. గత కొన్ని వారాలుగా హైపర్ ఆది ఢీ కామెడీ షో ని ఒంటి చేత్తో నడిపిస్తున్నాడనే చెప్పాలి. ఇక ఆదికి తోడుగా జూనియర్స్ టీం కి మెంటర్ గా ఉన్న అఖిల్ సార్థక్ మళ్ళీ బిగ్ బాస్ ఓటిటిలోకి అడుగుపెట్టడంతో .. ఢీ నుండి తప్పుకున్నాడు. అఖిల్ బిగ్ బాస్ కి వెళ్లినా.. ఢీ లో అతని లేని లోటు అంతగా తెలియదనే చెప్పాలి. ఎందుకంటే అఖిల్ కొత్తగా ఢీ లోకి ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి.

Advertisement
CJ Advs

అయితే గత వారం, ఈ వారం ఢీ డాన్స్ షో లో హైపర్ అది కనిపించడం లేదు. అదే సమయంలో ఆదివారం మధ్యాన్నం 1 గంటకు ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఆది కనిపించడం లేదు. ఆది, సుధీర్ చేసే ఫన్ శ్రీదేవి డ్రామా కంపెనీలో బాగా పండుతుంది. ఆది పంచెస్ మిస్ అవుతున్నారు బుల్లితెర ప్రేక్షకులు. ఇప్పుడు చూస్తే ఢీ షో లో కూడా ఆది మిస్సింగ్. కానీ జబర్దస్త్ లో యాజిటీజ్ గా ఆది వచ్చేస్తున్నాడు. ఆది తన టీం తో స్కిట్స్ లో పంచ్ ల వరద పారిస్తున్నాడు. కానీ ఢీ షో లో ఆది కామెడీ, ఫన్ పంచె లు మిస్ అవుతున్నారు ప్రేక్షకులు. మరి ఆది పర్సనల్ రీజన్స్ వలన షోకి దూరంగా ఉన్నాడో.. లేదంటే మారేదన్నా విషయమో అని హైపర్ ఆది అభిమానులు తెగ ఫీలైపోతున్నారు.

Hyper Aadi Missing from Dhee dance show:

Hyper Aadi Missing from Dhee dance show also after Sridevi Drama Company
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs