Advertisement
Google Ads BL

బాలయ్య ఫ్యాన్సుకి భలే కిక్కిచ్చే న్యూస్


అన్ స్టాపబుల్ ఎనర్జీతో అఖండ విజయం సాధించి మాంచి ఊపుమీదున్న బాలయ్య NBK 107 లోనూ మరోమారు తన నట విశ్వరూపాన్ని చూపుతున్నారని చెబుతోంది సినిమా యూనిట్. ఫిబ్రవరి 18 న ప్రారంభమైన NBK 107 చిత్రీకరణ తెలంగాణాలో పది రోజుల షెడ్యూల్ పూర్తి చేసుకుని ఆంధ్రా వైపు కదిలింది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు రోజులు గ్యాప్ తీసుకున్న బాలకృష్ణ రేపటినుంచీ మళ్ళీ షూటింగ్ కి అటెండ్ కానున్నారు. 

Advertisement
CJ Advs

కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మార్చి 3, 4 తేదీల్లో రెండు రోజుల షూటింగ్ కి అనుమతి తీసుకున్న NBK 107 టీమ్ అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బ్యాక్ డ్రాప్ లో బాలకృష్ణ పవర్ ఫుల్ సినిమా అంటే ఆయన అభిమానులకు పూనకాలు గ్యారంటీ. అందులోనూ బాలయ్య ఆరాధ్య దైవం అయిన నరసింహస్వామి ఆలయం కావడం, ఇప్పటికే బాలయ్యకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన లక్ష్మీ నరసింహస్వామి సెంటిమెంట్ ఉండనే ఉండడంతో NBK 107 పై అంచనాలు...  కాదు కాదు నమ్మకాలు పెరిగిపోతాయి ప్రేక్షకాభిమానులకి.!

లాస్ట్ ఇయర్ క్రాక్ తో సాలిడ్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని ఇపుడు NBK 107 ని మరింత ఛాలెంజింగ్ గా తీసుకుని బాలయ్యతో బాక్సాఫీసుని బద్దలు కొట్టించాలనే కసితో కథని సిద్ధం చేశారట. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఫాబ్యులస్ ఫామ్ లో ఉన్న తమన్ మ్యూజిక్ మరో బిగ్ ఎస్సెట్ కాబోతోంది. అలాగే ఈ మూవీలో బాలయ్య సరసన శృతిహాసన్ కనిపించనుండడం కూడా NBK 107 కి ఇంకో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. మొత్తానికి మోస్ట్ అవైటెడ్ మూవీగా మారిపోయిన ఈ NBK 107 కి చెందిన మరిన్ని వివరాలు, విశేషాలు మరో అప్ డేట్ లో..! 

NBK 107 Special Update For Nandamuri Fans:

NBK 107 Shooting in Famous Shrine Ahobilam Temple
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs