Advertisement
Google Ads BL

ఆయుధంలా బ్రతికే రామారావు ఆన్ డ్యూటీ


మాస్ మహారాజ రవితేజ కూడా డ్యూటీ ఎక్కారు. మహా శివరాత్రి సినిమా సెలబ్రేషన్స్ లో భాగంగా తన తాజా చిత్రం టీజర్ ని దింపారు. క్రాక్ తో హిట్ ట్రాక్ లోకి వచ్చినట్టే అనుకున్న రవితేజని రీసెంట్ గా వచ్చిన ఖిలాడీ మళ్ళీ వెనక్కి నెట్టింది.. మరోసారి పరీక్ష పెట్టింది.

Advertisement
CJ Advs

అందుకే రామారావు ఆన్ డ్యూటీ ఎంత పర్ ఫెక్ట్ గా ఉంటాడో చూపించి గట్టి హిట్టు కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు రవితేజ. మరిక కొంతసేపటి క్రితమే సోషల్ మీడియా వేదికగా విడుదలైన రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమా టీజర్ ఎలా ఉందంటే...

డిప్యూటీ కలెక్టర్ అయిన రామారావు డ్యూటీకి సంబంధించిన విజువల్సే ఎక్కువ ఉన్నాయి టీజర్ లో. రవితేజతో పాటు హీరోయిన్ గా చేస్తోన్న దివ్యంశ, నాజర్, నరేష్, తనికెళ్ళ భరణి, ప్రగతిలతో బాటు చాలా గ్యాప్ తర్వాత నటిస్తోన్న వేణు తొట్టెంపూడిని కూడా ఈ టీజర్ లో చూడొచ్చు.

అలాగే ఆయుధం మీద ఆధారపడే నీలాంటివాడి ధైర్యం వాడి ఆయుధంలో ఉంటుంది - ఆయుధంలా బ్రతికే నాలాంటి వాడి ధైర్యం అణువణువునా ఉంటుంది అనే డైలాగ్ ని హైలైట్ గా చెప్పుకోవచ్చు.

కానీ మాస్ మహారాజ్ వాక్ తో ఎలివేషన్ సీన్స్ ఉన్నాయనే హింట్ ఇస్తున్నా, ఫైట్స్ లోని షాట్స్ ఎన్ని పడుతున్నా రవితేజ మార్క్ మాత్రం మిస్ అయిందే అనిపించేలా ఉంది రామారావు వ్యవహారం. కొత్త దర్శకుడు సతీష్ మండవ చేస్తోన్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా ఇన్నేళ్ల తన కెరీర్ లో తొలిసారి ప్రొడక్షన్ లోకి ఎంటర్ అవుతూ RT టీమ్ వర్క్స్ పేరిట ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యారు రవితేజ. మరి తనని అంతగా ఎక్సయిట్ చేసిన ఎలిమెంట్ ఏదో తప్పక ఉండే ఉంటుంది కనుక ట్రైలర్ కోసం వెయిట్ చేద్దాం. రామారావు థియేటర్స్ లో డ్యూటీ ఎక్కిన రోజు మార్నింగ్ షో అయ్యాక మాట్లాడుకుందాం.!

Ramarao On Duty Teaser Arrived:

Raviteja Latest Film Ramarao On Duty Teaser Review 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs