విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ షూటింగ్ కంప్లీట్ చేసి రిలాక్స్ మోడ్ లో ఉన్నాడు. లైగర్ కోసం విజయ్ దేవరకొండ గత ఏడాదిన్నరగా.. హెయిర్ స్టయిల్ పెంచేసి.. సిక్స్ ప్యాక్ బాడీ ని మెయింటింగ్ చేస్తున్నాడు. ఇక లైగర్ షూటింగ్ పూర్తి కావడంతో విజయ్ దేవరకొండ లుక్ పూర్తిగా చేంజ్ చేసాడు. గుండు చేయించుకుని క్యాప్ పెట్టుకుని తిరుగుతూన్నాడు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ తన తదుపరి మూవీ కోసమే ఇలాంటి లుక్ లోకి మారిపోయాడంటున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ మూవీ చేసిన విజయ్ దేవరకొండ తన తదుపరి మూవీ కూడా పూరి దర్శకత్వంలోనే చెయ్యబోతున్నాడు. అదే పూరి డ్రీం ప్రాజెక్ట్ జన గణ మన.
మహేష్ లాంటి స్టార్స్ రిజెక్ట్ చేసిన ఈ జన గణ మన స్క్రిప్ట్ కి విజయ్ దేవరకొండ ఓకె చెప్పడంతో.. పూరి ఇమ్మిడియట్ గా రంగంలోకి దిగిపోయి సినిమాని మొదలుపెట్టే ఏర్పాట్లలో మునిగిపోయినట్లుగా తెలుస్తుంది. ఏప్రిల్ నుండి జన గణ మన మొదలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే విజయ్ దేవరకొండ ఈ సినిమాలో సోల్జర్ గా కనిపించబోతున్నాడట. అందుకే హెయిర్ తీసేసి.. కొద్దిగా పెంచబోతున్నాడట. సోల్జర్ లా విజయ్ దేవరకొండ కొత్తగా మేకోవర్ కాబోతున్నాడని, అందుకే గుండు చేయించుకుని మరీ హెయిర్ ని సోల్జర్ లుక్ కి అనుగుణంగా పెంచబోతున్నాడని అంటున్నారు.