Advertisement
Google Ads BL

వివాదంలో మంచు విష్ణు


ప్రస్తుతం మా అధ్యక్షుడు మంచు విష్ణు.. ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఏపీ సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల మీటింగ్ విషయంలో తమ తండ్రికి ఆహ్వానం వచ్చినా అది అందివ్వలేదంటూ సంచలనంగా మాట్లాడిన కొద్ది రోజులకే మంచు విష్ణు వెళ్లి జగన్ ని మీటయ్యి తిరుపతిలో స్టూడియో కట్టేందుకు సహాయసహకారాలు కావాలని.. జగన్ తో లంచ్ చేసి వచ్చారు. అలాగే తమ ఫ్యామిలీపై ట్రోల్ చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తామని వార్న్ చేసిన విష్ణు.. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. అది ఈ రోజు ఉదయం మంచు విష్ణు ఆఫీస్ లో ఓ దొంగతనం వెలుగులోకి వచ్చింది.

Advertisement
CJ Advs

మంచు విష్ణు ఆఫీస్ లో 5 లక్షల విలువైన సామాన్లు చోరికి గురయ్యాయి అంటూ విష్ణు మేనేజర్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. అయితే తమ హెయిర్ స్టైలిస్ట్ నాగ శీనుపైనే తమకి అనుమానం ఉంద‌ని.. విష్ణు మేనేజ‌ర్ ఆరోపించగా.. పోలీస్ లు నాగ శీనుని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో.. మోహన్ బాబు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ నాగ శీను మాత్రం మంచు విష్ణు ఆయన మేనేజర్ తనకి జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా తనని కులం పేరుతొ దూషించారని, ఓసారి మోకాలపుపై కూర్చోబెట్టి అవమానించడంతో వాళ్ళ దగ్గర పని మానేసాను అని, అందుకే ఇలా దొంగతనం నేరం తనపైకి నెట్టి కక్ష తీర్చుకుంటున్నారని అతనంటుంటే.. మంచు విష్ణు నాగ శీనుకి జీతం ఇవ్వకపోవడం.. ఎన్నో ఏళ్లుగా మోహన్ బాబు కి హెయిర్ స్టైలీష‌ర్‌గా పని చేస్తున్న నాగ శీనుకి సన్ అఫ్ ఇండియా కి సంబందించిన పారితోషకం ఇవ్వకపోవడంతోనే.. మంచు విష్ణు ఆఫిస్ నుండి అతను కాస్ట్లీ విగ్గులు ఎత్తుకెళ్లాడనే టాక్ కూడా మరోవైపు వినిపిస్తుంది. 

Hair Dresser Naga Srinu Sensational Comments On Manchu Vishnu:

Hair Dresser Naga Srinu about stole hairdressing equipment
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs