ప్రస్తుతం థియేటర్స్ దగ్గర చిన్న పెద్ద సినిమాల సందడి మొదలైపోయింది. గత వారం భీమ్లా నాయక్ పెద్ద సినిమాగా రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ హిట్ అయితే.. వచ్చే వారం శర్వా ఆడవాళ్లు, కిరణ్ సెబాస్టియన్ రిలీజ్ అవుతున్నాయి. తర్వాత రాధేశ్యామ్, ఆర్.ఆర్.ఆర్ లైన్ లో ఉన్నాయి. ఇక ఏప్రిల్ లోని వారానికో సినిమా చొప్పున రిలీజ్ కి సిద్దమవుతున్న సినిమాలు ఉన్నాయి.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జే డైరెక్షన్ లో తాప్సి పన్ను మెయిన్ లీడ్ లో తెరకెక్కిన మిషన్ ఇంపాజిబుల్ మ్యూజికల్ ప్రమోషన్లు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఈమద్యే ఏద్దాం గాలం అనే లిరికల్ వీడియోను విడుదల చేసింది, దీనికి మ్యూజిక్ లవర్స్ నుండి మంచి స్పందన వచ్చింది. సోమవారం నాడు సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించిన అప్డేట్ ని అందజేసారు మేకర్స్.
వేసవిలో అపరిమిత వినోదాన్ని అందించడానికి మిషన్ ఇంపాజిబుల్ ఏప్రిల్1న థియేటర్లలోకి రానుంది. తిరుపతికి సమీపంలోని ఓ మారుమూల పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశంతో ప్రేక్షకులను మైమరిపించే చిత్రంగా రూపొందింది.