Advertisement
Google Ads BL

పార్టీలో పవన్ ఎంట్రీ అదిరిందిగా


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటించిన భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ హిట్ ని టీం ఎంజాయ్ చెయ్యడమే కాదు.. భీమ్లా నాయక్ ప్రవేట్ పార్టీలో అందరూ కలిసి ఎంజాయ్ చేసారు. పవన్ కళ్యాణ్ ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసిన ఈ పార్టీకి పవన్ తో కలిసి పని చేసే దర్శకులతో పాటుగా.. పని చేసిన వకీల్ సాబ్ డైరెక్టర్ కూడా హాజరయ్యారు. క్రిష్, హరీష్ శంకర్, అలాగే భీమ్లా డైరెక్టర్ సాగర్, సునీల్, భీమ్లా టీం మొత్తం ఈ ప్రవేట్ పార్టీలో ఎంజాయ్ చేసారు. ప్రస్తుతం భీమ్లా నాయక్ ప్రవేట్ పార్టీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement
CJ Advs

అయితే ఈ పార్టీ లో అసలైన స్పెషల్ ఎంట్రీ ఎవరంటే.. ఇంకెవరు పవర్ స్టారే. పవన్ కళ్యాణ్ పార్టీ స్టయిల్లో రెడీ అయ్యి కారు దిగి ఆయన నడుచుకుంటూ వచ్చే ఇరువైపులా లైట్స్ పెట్టి పవన్ కి వెల్ కం చెప్పారు. ఇక పవన్ అలా నడుస్తూ వెళ్లి భీమ్లా నాయక్ తో తనకి సక్సెస్ అందించిన త్రివిక్రమ్ ని ఆప్యాయంగా హగ్ చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ పార్టీలో భీమ్లా డైరెక్టర్ సాగర్.. గణేష్ మాస్టర్ తో కలిసి లాలా బీమ్లా సాంగ్ కి స్టెప్స్ వేసారట. అయితే ఈ పార్టీలో రానా దగ్గుబాటి మిస్ అయినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చిన ఏ పిక్ లోను రానా కనిపించలేదు.

Pawan Kalyan entry at Bheemla Nayak Success Party:

Pawan Kalyan Grand Entry AT Bheemla Nayak Success Party
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs