Advertisement
Google Ads BL

పర్సనల్ ఇష్యూస్ వలనే ఓటిటికి: అఖిల్


బిగ్ బాస్ సీజన్ 4 లో అభిజిత్ విన్నర్ గాను, విన్నర్ అవుతాడనుకున్న అఖిల్ సార్థక్ రన్నర్ గా బయటికి వచ్చారు. బిగ్ బాస్ లో మోనాల్ గజ్జర్ తో నడిపిన ట్రాక్ అఖిల్ కి బాగా హెల్ప్ అయ్యి.. అతనికి మంచి క్రేజ్ వచ్చింది. ఇక బిగ్ బాస్ రన్నర్ గా బయటికి వచ్చిన అఖిల్ సార్థక్.. వెబ్ సీరీస్, అలాగే హీరోగానూ సినిమాలకు కమిట్ అయ్యాడు. ఇంకా అఖిల్ ఢీ డాన్స్ షో అనే పెద్ద రియాలిటీ షో కి మెల్ యాంకర్ గా అడుగుపెట్టాడు. ఇప్పటికే నాలుగైదు ఎపిసోడ్స్ లో హైపర్ ఆది తో కలిసి అఖిల్ ఆకట్టుకున్నాడు.

Advertisement
CJ Advs

అలాంటి అఖిల్ బిగ్ బాస్ ఓటిటిలో కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రీసెంట్ గానే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ తెలుగు ఓటిటి మొదలైంది. అందులోకి ఓల్డ్ కంటెస్టెంట్స్ రూపంలో అఖిల్ అడుగుపెట్టడం కాస్త షాకిచ్చింది. ఇంత బిజీ పర్సన్ ఓటిటి బిగ్ బాస్ కి ఎందుకొచ్చాడా? అని. అయితే బిగ్ బాస్ లోకి వెళ్ళాక అఖిల్ సోషల్ మీడియా టీం.. అఖిల్ చేసిన వీడియోని పోస్ట్ చేసారు. అందులో అఖిల్ తానెందుకు బిగ్ బాస్ కి వచ్చాడో చెప్పుకొచ్చాడు. తాను కెరీర్ లో బిజీగా ఉన్నప్పటికీ.. బిగ్ బాస్ లో సెకండ్ ఛాన్స్ రావడం బిగ్ థింగ్ అని, అయితే కొన్ని పర్సనల్ రీజన్స్, ఫ్యామిలీ రీజన్స్ వలన బిగ్ బాస్ ఓటిటికి వచ్చాను అని, వ్యక్తిగత కారణాలను బయటికి చెప్పను కానీ.. కేవలం దానికోసమే వచ్చాను అని, తనని సపోర్ట్ చెయ్యమని అడిగాడు. ఇక ఈ వారం నామినేషన్స్ లో అఖిల్ ని కూడా కొంతమంది హౌస్ మేట్స్ నామినేషన్స్ లో నించోబెట్టారు. 

Bigg Boss OTT contestant Akhil sarthak emotional video:

Bigg Boss OTT Akhil Sarthak Emotional Video Before Enter Bigg Boss
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs