Advertisement
Google Ads BL

1 మినిట్ రెండో ట్రైలర్ 2 న రిలీజ్


మార్చ్ 11 న రిలీజ్ కాబోతున్న రాధే శ్యామ్ ప్రమోషన్స్ గ్రాండ్ గా మొదలైపోయాయి. రాధా కృష్ణ ఇంటర్వ్యూ తో రాధే శ్యామ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన టీం.. సినిమాపై అంచనాలు, క్రేజ్ పెంచేందుకు కసరత్తులు చేస్తుంది. ప్రభాస్ - పూజ హెగ్డే కాంబో సాంగ్స్ వదులుతూ.. హైప్ క్రియేట్ చేస్తున్న టీం.. రాధే శ్యామ్ నుండి రెండో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మార్చ్ 2 న రెండో ట్రైలర్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజో రేపో ఆ ట్రైలర్ పై అధికారిక ప్రకటన కూడా రావొచ్చు. అయితే మార్చ్ 2 న వదలబోయే రాధే శ్యామ్ ట్రైలర్ నిడివి 1 నిమిషంగా ఉండబోతుందట. మొదటి ట్రైలర్ లో విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజ హెగ్డే మధ్యన లవ్, ఎమోషన్ చూపించారు. కానీ కథ పై ఎలాంటి క్లూ ఇవ్వలేదు.

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడు రాబోతున్న రెండో ట్రైలర్ లో ఫాన్స్ మెచ్చే, ఆడియన్స్ నచ్చే అంశాలు, పూజ క్యూట్ లుక్స్, ప్రభాస్ అద్భుతమైన డైలాగ్స్ రాధే శ్యామ్ కొత్త ట్రైలర్ లో ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇక హిందీలో రాధే శ్యామ్ కి బిగ్ బి వాయిస్ ఓవర్ ఇస్తుండగా.. తెలుగులో డార్లింగ్ ప్రభాస్ కోసం రాజమౌళి రంగంలోకి దిగుతున్నారు. ఇంకా మిగిలిన భాషల్లో ప్రముఖులైన నటులు రాధే శ్యామ్ కి వాయిస్ ఇవ్వబోతున్నారు. మలయాళంలో పృద్వి రాజ్, కన్నడలో పునీత్ రాజ్ కుమార్ బ్రదర్ శివ రాజ్ కుమార్ రాధే శ్యామ్ కి గొంతు సవరించబోతున్నట్లుగా మేకర్స్ అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. 

1 Minute Second Trailer 2nd Released:

Radhe Shyam 1 Minute Second Trailer 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs