ఇప్పుడు కోవిడ్ అనే మాట సర్వసాధారణం అయ్యిపోయింది. కోవిడ్ కారణంగా మహామహులని పోగొట్టుకున్నాం. కోవిడ్ బారిన పడికోలుకున్నవారు ఉన్నారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంత ప్రతాపం థర్డ్ వేవ్ లో లేకపోయినా.. చాలామంది కోవిడ్ బారిన పడ్డారు. కోలుకున్నారు. గత ఏడాది కోలీవుడ్ నటులు కమల్ హాసన్ కోవిడ్ బారిన పడి హాస్పిటల్ పాలయినా.. ఆయన ఆరోగ్యంగా ఇంటికి తిరిగివచ్చారు. తాజాగా ఆయన కూతురు ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ కరోనా బారిన పడింది.
తనకి కరోనా సోకినట్లుగా శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకి షేర్ చేసింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకి కరోనా సోకింది అని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లుగా చెప్పిన శృతి హాసన్ త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను అంటూ షేర్ చేసింది. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్, బాలకృష్ణ 107 లో శృతి హాసన్ నటిస్తుంది. ఇక బాయ్ ఫ్రెండ్ శాంతను తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ శృతి హాసన్ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా పోస్ట్ లు పెడుతుంది.