Advertisement
Google Ads BL

50 మిలియన్ కొట్టేసిన మహేష్ మ్యాజిక్


వాలంటైన్స్ డే గిఫ్టుగా ఫిబ్రవరి 14 న రిలీజ్ చేసేందుకు చక్కని ఏర్పాట్లు చేసుకుంటే లీకు వీరుల దెబ్బకి ఒక రోజు ముందే కళావతి పాటని వదలాల్సి వచ్చింది సర్కారు వారి టీమ్ కి.

Advertisement
CJ Advs

అయితేనేం... రిసీవింగ్ అదిరిపోయింది. రెస్పాన్స్ ఓ రేంజ్ లో వచ్చింది.

మహేష్ బాబు - కీర్తి సురేష్ ల క్యూట్ కెమిస్ట్రీని చూపిస్తూ శ్రావ్యమైన మెలోడియస్ ట్యూన్ తో థమన్ తీర్చిదిద్దిన కళావతి సాంగ్ సిద్ శ్రీరామ్ స్వరంతో ప్రాణం పోసుకుని మ్యూజిక్ లవర్స్ కి ఇన్ స్టంట్ గా ఎక్కేసింది. ముఖ్యంగా ఈ మ్యూజిక్ వీడియోని తన ఛార్మింగ్ లుక్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లిన మహేష్ తనదైన శైలిలో వేసిన సిగ్నేచర్ స్టెప్ అయితే విపరీతంగా వైరల్ అయిపోయింది. ఇప్పటికే ఎంతోమంది అభిమానులు ఆ డాన్స్ మూమెంటుని అనుకరిస్తూ కవర్ సాంగ్ చేసేసి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. చివరికి హీరోయిన్ కీర్తి సురేష్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, మహేష్ డాటర్ సితార కూడా కళావతి బీట్ కి మహేష్ మ్యాజికల్ స్టెప్ ని మ్యాచ్ చేసేందుకు ప్రయత్నించడం విశేషం. 

ఇక విడుదలైన రోజునుంచే యూట్యూబ్ లో వ్యూస్ వైజ్, లైక్స్ వైజ్ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ వస్తోన్న కళావతి లిరికల్ సాంగ్ నేడు 50 మిలియన్ మార్క్ అనే మైల్ స్టోన్ ని రీచ్ అయింది. స్ట్రీమింగ్ కి వచ్చిన 13 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ దక్కించుకోవడం, 1.3 మిలియన్స్ కి పైగా లైక్స్ రాబట్టడం ఈ చార్ట్ బస్టర్ సాంగ్ సాధించిన ప్రత్యేక ఘనతగా చెప్పుకోవచ్చు. మరి మొదటి పాటతోనే ఇలా కొత్త రికార్డులకు తెరతీసిన సూపర్ స్టార్ మహేష్ మే 12 న రాబోయే సర్కారు వారి పాటతో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో.!

Click Here To Watch KALAAVATHI Music Video

50 Million Views For Mahesh Magical Song Kalaavathi:

Huge Response For Sarkaru Vaari Paata Kalaavathi Song
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs