Advertisement
Google Ads BL

ఫ్లాష్ : మరికొద్దిసేపట్లో మెగా అప్ డేట్


కోవిడ్ వల్ల కుదేలైన సినీ పరిశ్రమకి మళ్ళీ కళ తెచ్చేందుకు, మునుపటి వైభవాన్ని రప్పించేందుకు మన హీరోలందరూ వరుసగా సినిమాలు చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా మెగా స్టార్ చిరంజీవి అయితే చిరుత వేగం చూపేందుకు నేటికీ తాను సిద్దమే అంటూ ఏకంగా ఐదు సినిమాలను ఆర్డర్ లో పెట్టారు. తనయుడు చరణ్ తో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య ఏప్రిల్ 29 న రాబోతోంది. మోహన్ రాజా దర్సకత్వంలో చేస్తోన్న గాడ్ ఫాదర్ మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. మెహర్ రమేష్ డైరెక్షన్ లో చేస్తోన్న భోళా శంకర్ షూటింగ్ ప్రస్తుతం జోరుగా జరుగుతోంది. కె.ఎస్.రవీంద్ర నేతృత్వంలో చేయనున్న వాల్తేర్ వీరయ్య ఇప్పటికే ఓ చిన్న షెడ్యూల్ ఫినిష్ చేసుకుని చిరు డేట్స్ కోసం వెయిటింగ్ లో ఉంది. అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేస్తానంటూ ప్రకటించారు చిరు. ఇలా కంటిన్యూస్ ప్రాజెక్ట్స్ తో మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపుతోన్న చిరంజీవి నేడు అభిమానులకో సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు వెల్లడైంది.

Advertisement
CJ Advs

చిరు - తమన్నా కాంబినేషన్ లో కీర్తి సురేష్ ముఖ్య పాత్రలో మెహర్ రమేష్ చేస్తోన్న వేదాళం రీమేక్ భోళా శంకర్ సినిమాకి సంబంధించి ఓ స్పెషల్ న్యూస్ వింటారంటూ ట్వీట్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్. మెగా మాసివ్ భోళా శంకర్ అప్ డేట్ ఎట్ 11:07 AM అంటూ అఫీషియల్ అకౌంట్ నుంచే ట్వీట్ పడడంతో మెగాభిమానుల్లో ఆత్రుత మొదలైంది.. సోషల్ మీడియాలో హడావిడి స్టార్తయింది. గత రెండు రోజులుగా భీమ్లా ఊపుని బాగా ఎంజాయ్ చేస్తోన్న మెగాభిమానులకు ఊహించని విధంగా వస్తోన్న ఈ చిరు కానుక ఏంటనేది మరికొద్దిసేపట్లో... మరో అప్ డేట్ లో..! 

Mega Star Movie Update Shortly:

Chiranjeevi Film Bhola Shankar Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs