Advertisement

పెద్ద హిట్ ఇచ్చి పెదవి విప్పిన త్రివిక్రమ్


భీమ్లా నాయక్ విషయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మౌనం వహించడం అభిమానులని కంగారు పెట్టింది. ఏ పవన్ కళ్యాణ్ వేడుకలో అయినా ఖచ్చితంగా మాట్లాడే త్రివిక్రమ్.. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకలో వేదికకు కంప్లీట్ గా దూరంగా ఉండడం చాలా సందేహాలకు తావిచ్చింది. కొందరు విజయం తర్వాతే మాట్లాడతారని పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటే.. మరికొందరు డైరెక్టర్ సాగర్ ని కనబడనివ్వకుండా చేస్తున్నారనే విమర్శలకి చెక్ పెట్టడానికే దూరంగా ఉన్నారని మాట్లాడారు. ఏదేమైనా నిన్న వచ్చిన భీమ్లా నాయక్ తో అన్ని సందేహాల్ని పటాపంచలు చేసేసారు. 

Advertisement

పెద్ద హిట్ తర్వాత ఈ రోజు జరిగిన భీమ్లా నాయక్ సక్సెస్ మీట్ లో పెదవి విప్పారు త్రివిక్రమ్.. ముందుగా మీడియా కి థాంక్స్ చెప్పిన త్రివిక్రమ్, సినిమాని మేము చేస్తే.. ప్రేక్షకుల్లోకి మీడియా తీసుకువెళ్ళింది.. అందరికి పాదాభివందలు అంటూ ఆయన స్పీచ్ మొదలు పెట్టారు. అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాని రీమేక్ చేస్తున్నామంటే.. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అది రీమేక్ లా ఉండకూడదు. ఆ సినిమాలో కథ మొత్తం కోషి నుండి చెప్పబడింది. అది తెలుగులో భీమ్లా వైపుకి ఎలా తిప్పాలి, ఎలా తీసుకురావాలని ఫస్ట్ ఎక్కువగా ఆలోచించాం. అడవికి సెల్యూట్ చెయ్యడంతో స్టార్ట్ చేస్తే.. భీమ్లా నాయక్ కేరెక్టర్ ని అడవికి దగ్గరగా తీసుకుని వెళ్తే.. అతని కేరెక్టర్ కి ఎక్కువ జస్టిఫికేషన్ దొరుకుంది అనిపించింది. ఒరిజినల్ నుండి బయటికి రావడానికి మేము చేసిన ప్రయత్నం ఏమిటి అంటే.. స్క్రీన్ మీద ఉంటే భీమ్లా ఉండాలి, లేదంటే డ్యాని ఉండాలి.. కాదు అంటే ఇద్దరూ ఉండాలి. అందుకే లాస్ట్ కొచ్చేసరికి ఇద్దరినీ అలా చూపించాం. 

భీమ్లా వైఫ్ పెరగమంటుంది, డ్యానీ వైఫ్ తగ్గుమంటుంది. భీమ్లా వైఫ్ గొడవ చెయ్యమంటుంది, డ్యానీ వైఫ్ కాంప్రమైజ్ కమ్మంటుంది. ప్రతి సీన్ కి కౌంటర్ ఉండేలా చేసాం సినిమాని. ఒరిజినల్ కథ మీద ప్రేమని చంపుకుంటే..  దాని నుండి మనం దూరం జరగగలం.. అదే ఇక్కడ చేసాము. ఇక పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ ని హ్యాండిల్ చెయ్యడం చాలా టఫ్ జాబ్. దర్శకుడు సాగర్ ఎమన్నా తటపటాయిస్తాడేమో, లేదా సందేహిస్తాడు అనే ఉద్దేశ్యంతో  నేనున్నప్పుడు నేను, లేదా చినబాబు గారు ఉన్నప్పుడు చినబాబు గారు, లేదు అంటే నాగ వంశీ ఉన్నపుడు వంశీ ఇలా పవన్ కళ్యాణ్ గారితో కమ్యూనికేషన్ కోసం మేము బ్రిడ్జ్ లా పని చేసాము. సాగర్ ఎక్సట్రార్డినరీగా చేసాడు సినిమాని. తనకి మంచి ఫ్యూచర్ ఉంది. థమన్ నా సొంత మనిషి. థమన్ గురించి చెప్పేదేముంది.. ఈమధ్యన థమన్ సంగీతంతో మాట్లాడుతున్నాడు. 

ఇక రవి కె చంద్రన్ ఇంత పెద్ద సినిమాని కేవలం 57 వర్కింగ్ డేస్ తో అంత అద్భుతమైన క్వాలిటీతో అవుట్ తీసుకురావడం నిజంగా గ్రేట్. ఆయనే కాదు.. ఈ సినిమాకి పనిచేసిన యూనిట్ మెంబెర్స్ అందరూ కూడా మనసు పెట్టి పని చేసారు. పవన్ కళ్యాణ్, రానా అంత పెద్ద స్టార్స్ అయ్యుండి కోవిడ్ టైం లో అంత పెద్ద రిస్క్ తీసుకుని కొన్నివందల మంది మధ్య షూట్ లో పాల్గొన్నారు. ఇంకా ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు అంటూ స్పీచ్ ముగించారు త్రివిక్రమ్.  

Trivikram Speech at Bheemla Nayak Success Meet:

Bheemla Nayak Success Meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement