అలియా భట్ ఆర్.ఆర్.ఆర్ కి ప్లస్ అవుతుంది, నార్త్ లో భారీ క్రేజ్ వస్తుంది అని రాజమౌళి నమ్మి ఆమెని కీలకమైన సీత కేరెక్టర్ కి తీసుకున్నారు. సీత గా అలియా భట్ లుక్, ఆమె కేరెక్టర్, ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో అలియా భట్ వ్యవహరించిన తీరు అన్ని హైలెట్. కానీ ఇప్పుడు ఆమె స్టార్ కిడ్ నెగెటివిటీని ఎదుర్కొంటుంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత నెటిజెన్స్ నుండి అలియా భట్ తీవ్రమైన ద్వేషాన్ని చవి చూస్తుంది. దానితో ఆమె నటించిన గంగూభాయ్ కతీయవాడి సినిమాలో అలియా భట్ నటనకు ప్రశంశలు వస్తున్నా, విమర్శకుల సైతం అలియా భట్ నటనని పొగుడుతున్నా.. ఆ సినిమా కి క్రేజ్ రావడం లేదు.
ప్రస్తుతం గంగూబాయి కతీయవాడి చిత్రానికి ఐఎండీబీ లో 3.7/10 రేటింగ్ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం ఆ రేటింగ్ 3.9 గా ఉంది. కానీ ఆ రేటింగ్ ఇప్పుడు మరింత దిగజారింది. గంగూభాయ్ కతీయవాడి సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా బావుంది అని, సెకండ్ హాఫ్ నిడివి ఎక్కువవడం, సంజయ్ లీలా మేకింగ్ వీక్ గా ఉంది అంటున్నారు. అలియా భట్ పెరఫార్మెన్స్ ఇరగదీసింది అని, అలాగే సినిమాలో ఫస్ట్ హాఫ్, క్లయిమాక్స్ బావున్నా.. అలియా భట్ నెగెటివిటీకి ఐఎండీబీ లో రేటింగ్ తగ్గిపోయింది అని.. ఇదే నెగెటివిటి ఆర్.ఆర్.ఆర్ మీద పడే అవకాశం ఉంది అంటున్నారు. ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫాన్స్ ప్రస్తుతం ఈ టెంక్షన్ లోనే ఉన్నారు. గతంలో ఆమె మీద నెగెటివిటీ వచ్చినా.. ఆమె పెరఫార్మెన్స్ పరంగా టాప్ లో ఉన్నారు అందుకే నేను అలియా భట్ ని తీసుకున్నాను, నేనేమి అవి పట్టించుకోలేదని రాజమౌళి అప్పట్లో చెప్పినా.. ఇప్పుడు మాత్రం ఆయనకి టెంక్షన్ మొదలైంది అని ఇన్ సైడ్ టాక్.