Advertisement
Google Ads BL

పూనమ్ కౌర్ ఏం చెప్పాలనుకుంటుంది


పూనమ్ కౌర్.. ఈ పేరు పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయినా, త్రివిక్రమ్ సినిమాలు రిలీజ్ అయినా లేదంటే వారు కలయికలో ఏదో ఒక సందర్భంగా సోషల్ మీడియాలో హైలెట్ అయ్యే పేరు. కత్తి మహేష్ ఉన్నప్పుడు పూనా కౌర్ - పవన్ కళ్యాణ్ ఫాన్స్ మధ్యన పెద్ద వార్ జరిగింది కూడా. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుండి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా మారింది. ఆర్జీవీ.. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఈవెంట్ లో చాలా హుందాగా స్పీచ్ ఇచ్చారంటూ ట్వీట్ వెయ్యగానే.. ఓ దర్శకుడు మూల నించుకుని నవ్వుకుంటాడని, ఈవెంట్ జరుగుతున్న సమయంలో రాజకీయాలు, సినిమాలు అంటూ ఏదో ట్వీట్ చేసింది.

Advertisement
CJ Advs

ఇక నేడు భీమ్లా నాయక్ ప్రభంజనం ఆ సినిమా విడుదలైన ప్రతి యొక్క థియేటర్ దగ్గరా కనిపిస్తుంది. భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ టాక్ తో ఫాన్స్ రచ్చ చేస్తున్నారు. ఇంతలోపులో పూనమ్ కౌర్ ఓ వ్యక్తి పెట్టుకున్న వాట్స్ ఆప్ చాట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ చాట్ లో ఓ వ్యక్తి సినిమాకి వచ్చిన అక్కా.. బావ సినిమాకి వెళ్ళాను, ఉదయం 8 గంటలకు.. స్టార్ ఎమోజీలను రిప్లైగా ఇచ్చాడు. ఇక వాటికి సిగ్గుపడుతున్నట్టుగా ఎమోజీలతో పాటు.. నిజాయితీగా రివ్యూ చెప్పమని అడుగుతారు. సరే అక్కా అని అవతలి వ్యక్తి రిప్లై ఇచ్చాడు. అక్కా సినిమా హిట్.. ట్రస్ట్ మీ.. ప్రామీస్ చెబుతున్నా అని అవతలి వ్యక్తి రిప్లై ఇస్తారు.. ఆ స్క్రీన్ షాట్ ని పూనమ్ కౌర్ సోషల్ మీడియా లో పోస్ట్ చెయ్యడంతో.. పూనమ్ కౌర్ అసలు ఏం చెప్పాలనుకుంటుందో అంటున్నారు నెటిజెన్స్.

Poonam Kaur posts on Twitter:

Bawa cinema hit: Poonam Kaur posts on Twitter
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs