మూడు వారాల క్రితం ఏపీ సీఎం తో టాలీవుడ్ ప్రముఖులైన మెగాస్టార్ చిరు, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి లాంటి వారు అమరావతికి వెళ్లి సమావేశమై సినిమా పరిశ్రమలోని సమస్యలను జగన్ కి వివరించి, టికెట్ రేట్స్ ఇష్యు, ఐదో ఆటకి అనుమతులు తీసుకుని రావడంతో.. మంచు ఫ్యామిలీ తమకి ఆహ్వానం వచ్చినా అది మాకు రానివ్వలేదంటే.. నందమూరి బాలకృష్ణ నాకు సీఎం ఆహ్వానం అందింది.. కానీ వెళ్ళలేదు. నేను సీఎం జగన్ ని కలవను, ఆయన 100 కోట్ల బడ్జెట్ మూవీకి రాయితీ ఇస్తాను అన్నారు, నేను 100 కోట్ల బడ్జెట్ మూవీ చెయ్యను, ఆయన్ని కలవను. నా అఖండ మూవీ టికెట్ రేట్స్ తక్కువగా ఉన్న టైం లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అదే పెద్ద ఉదాహరణ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.
అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ప్రీమియర్స్, టికెట్ రేట్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దానిలో భాగంగా పేర్ని నాని ని కొంతమంది జర్నలిస్టు లు బాలకృష్ణ గారు జగన్ ని కలవను అన్నారు అనగానే.. అవునా బాలకృష్ణ గారు అలా అన్నారా? ఎందుకంటే అఖండ రిలీజ్ కి ముందు అఖండ నిర్మాతలు నూజివీడు ఎమ్యెల్యే తో ఫోన్ చేయించి నాతో మీటింగ్ పెట్టుకున్నారు. నేను అమరావతిలో కలెక్టర్లు మీటింగ్ తర్వాత అఖండ నిర్మాతలతో సమావేశమవ్వగా.. వాళ్ళు మా బాలకృష్ణగారు మీతో మాట్లాడతారు అని ఫోన్ రింగ్ ఇచ్చారు. అదేమిటి ఫోన్ చెయ్యకుండా రింగ్ ఇచ్చారు బాలకృష్ణగారికి అని అడగగా.. ఆయన ముహూర్తం చూసుకుని మీకు ఫోన్ చేస్తారని వాళ్ళు చెప్పారు.
తర్వాత బాలకృష్ణ గారు ఫోన్ చేసి అఖండ రిలీజ్ విషయంలో జగన్ గారిని కలవాలని ఆయన నన్ను అడిగారు. నేను జగన్ గారితో బాలకృష్ణ గారు కలవనుకుంటున్నారు మిమ్మల్ని అని చెప్పగా.. ఎందుకంటా అని ఆయన అడిగారు. అఖండ రిలీజ్ విషయంలో ఏవో మాట్లాడాలని అనగా.. నన్ను కలిస్తే ఆయన గౌరవం తగ్గుతుంది.. అదేదో మీరే చూడండి అని జగన్ గారు నాకు చెప్పారు. నేను ఇంతవరకు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. బాలకృష్ణ గారు అలా అనరు. ఆయన అబద్దం చెప్పే మనిషి కాదు.. బాలకృష్ణ గారు జగన్ ని కలవడానికి వెళ్ళను అని అన్నారంటే నేను నమ్మను అని మీడియా ముఖంగా నాని అఖండ నిర్మాతలు తనని కలిసారని, బాలయ్య తనతో ఫోన్ మాట్లాడారంటూ చెప్పారు.