Advertisement
Google Ads BL

పోలీస్ బలగాలతో భీమ్లా థియేటర్స్ కట్టుదిట్టం


పవన్ కళ్యాణ్ ని రాజకీయం ఎదుర్కోవాలి కానీ, ఇలా సినిమాల విషయంలో కక్ష పూరితంగా ఉండరాదని, పవన్ పై దాడి చేయాలనుకుంటే రాజకీయంగా చేయాలని, అంతేగానీ ఇలా ఆంక్షలు విధించడం వల్ల ఎగ్జిబిటర్ల వ్యవస్థకే నష్టం చేకూరుతుంది అంటూ ఎన్వీ ప్రసాద్ ఏపీ ప్రభుత్వం ధ్వజమెత్తారు. ఏపీలో భీమ్లా నాయక్ విడుదలవుతుంది అన్నాక.. అక్కడ థియేటర్స్ దగ్గర ప్రభుత్వం నిఘా పెట్టింది అని, చాలా కట్టుదిట్టంగా ఆ నిఘానీ అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం వెనుకాడడం లేదు అని, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ విషయంలో ఏపీ ప్రభుత్వం కావాలనే ఇలాంటి జీవోలని అమలు చేస్తుంది, ఈ దాడి పవన్ కళ్యాణ్ పై కాద‌ని, ఇది థియేటర్ల వ్యవస్థ పై దాడి అని ఎన్వీ ప్రసాద్ తో పాటుగా పవన్ ఫాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

అయితే భీమ్లా నాయక్ థియేటర్స్ దగ్గర ఎర్లీ మార్నింగ్ షోస్ పడకుండా, పవన్ ఫాన్స్ హడావిడి లేకుండా, రేట్స్ పెంచి అమ్మకుండా.. ఏపీ ప్రభుత్వం ఏకంగా పోలీస్ బలగాలను రంగంలోకి దించింది. చాలా థియేటర్స్ దగ్గర పవన్ ఫాన్స్ రచ్చ లేకుండా పోలీస్ లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో వకీల్ సాబ్ విషయంలో ఇలానే వ్యవహరించిన ఏపీ ప్రభుత్వం.. భీమ్లా నాయక్ విషయంలో మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చెయ్యడం ఫాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఇక టికెట్ రేట్స్ సమస్యతో, జగన్ ప్రభుత్వం తీసుకున్న సరి కొత్త నిర్ణయాలతో దాదాపు శుక్రవారం రోజు అరవై థియేటర్లు క్లోజ్ అయినట్లుగా తెలుస్తోంది.

AP Govt arranged Police force for Bheemla nayak Theaters:

AP Govt Working Hard To Save People From Bheemla Nayak
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs