Advertisement
Google Ads BL

భీమ్లా ఊపు చూస్తే ఊచకోతే


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్, లాలా భీమ్లా అంటూ పవన్ ఫాన్స్ థియేటర్స్ దగ్గర చేసే రచ్చ చూస్తే ఓ పెద్ద జాతరని తలపిస్తుంది. ఫిబ్రవరి 25 న వరల్డ్ వైడ్ గా భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అన్నప్పటికీ.. మేకర్స్ సినిమాని పెద్దగా ప్రమోట్ చెయ్యకపోయినా.. రెండు ట్రైలర్ రిలీజ్ చెయ్యడం, ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే ప్రేక్షకుల్లో ఊపొచ్చింది. మాస్ ఆడియన్స్ కి పూనకాలు మొదలైపోయాయి. టీం ఇంటర్వ్యూ లేదు, రానా, నిత్యా మీనన్ ఇంటర్వ్యూ, త్రివిక్రమ్ హడావిడి.. ఇలా ఏది లేకుండానే భీమ్లా నాయక్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ సిటీలోనే భీమ్లా నాయక్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోవడమే కాదు.. రికార్డ్ టికెట్ బుకింగ్స్ తో భీమ్లా నాయక్ రికార్డులు సృష్టించింది. ఇక నేటి అర్ధరాత్రి నుండే భీమ్లా నాయక్ జాతర మొదలైపోయింది. ఉదయం 5 గంటలకే సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ పడిపోయింది.

Advertisement
CJ Advs

ఆ రేంజ్ లో పవన్ ఫాన్స్ రెచ్చిపోయి భీమ్లా నాయక్ థియేటర్స్ దగ్గర టపాసులు కలుస్తూ, పబ్లిక్ టాక్ ఇస్తూ నానా హంగామా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గా ఎంట్రీ కే ఫాన్స్ విజిల్స్ వేస్తూ.. థియేటర్స్ టాప్ లేపేస్తున్నారు. పవన్ - రానా కాంబో సీన్స్ కి కేకలు పెడుతున్నారు. ఈ ఊపు చూస్తుంటే భీమ్లా నాయక్ కలెక్షన్స్ పరంగా ఊచకోత కోయడం ఖాయం.. ఇప్పటికే యుఎస్ ప్రీమియర్స్ పూర్తవడం, కొన్నిచోట్ల రివ్యూస్ అద్భుతంగా రావడం, భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ సోషల్ మీడియాలో ఆడియన్స్ రివ్యూ లు, థియేటర్స్ దగ్గర భీమ్లా నాయక్ పబ్లిక్ టాక్ ఇవన్నీ చూస్తుంటే భీమ్లా నాయక్ బాక్సాఫీసుని ఊచ కొత్త కొయ్యడం పక్కగానే కనిపిస్తుంది. చూద్దాం భీమ్లా నాయక్ ఓపెనింగ్ కలెక్షన్స్ పరంగా ఎన్ని రికార్డులు నమోదు అవుతాయో అనేది. 

Bheemla Nayak Public Talk:

Power Star Pawan Kalyan Bheemla Nayak Social Media Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs