Advertisement
Google Ads BL

బిగ్ బాస్: కమల్ ప్లేస్ లోకి ఆ హీరో


తమిళంలో ఈమధ్యనే గ్రాండ్ గా బిగ్ బాస్ ఓటిటి మొదలయ్యింది. గత సీజన్స్ కి హోస్ట్ గా చేసిన కమల్ హాసన్ హోస్ట్ గానే బిగ్ బాస్ ఓటిటి ని మొదలు పెట్టింది తమిళ బిగ్ బాస్ యాజమాన్యం. అయితే గత సీజన్ టైం లో కమల్ కి కరోనా రాగా.. ఆయన రెండు వారాల పాటు సీజన్ 5 కి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత యధావిధిగా ఆయన బిగ్ బాస్ లోకి వచ్చేసారు. అయితే గత వారం కమల్ హాసన్ ఉన్నట్టుండి బిగ్ బాస్ నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. కోవిడ్ సిట్యువేషన్ తర్వాత సినిమా షూటింగ్ డేట్స్ ని అడ్జెస్ట్ చేయలేకపోతున్న కారణంగా బిగ్ బాస్ కి టైం కేటాయించలేకపోతున్నాను అంటూ కమల్ తప్పుకున్నారు .

Advertisement
CJ Advs

కమల్ తప్పుకోవడంతో ఆయన ప్లేస్ లోకి మళ్ళీ ఏ పేరున్న హీరో వస్తారో అనే అతృతతో తమిళ జనాలు ఉన్నారు. కమల్ ప్లేస్ లో రమ్యకృష్ణ పేరు వినిపించినా ఫైనల్ గా కమల్ స్థానంలో బిగ్ బాస్ ఓటిటికి హోస్ట్ గా తమిళ హీరో శింబు రాబోతున్నాడు. ఆ విషయాన్ని తమిళ బిగ్ బాస్ యాజమాన్యం సోషల్ మీడియాలో అఫీషియల్ గా ప్రకటించడమే కాదు.. శింబు హోస్ట్ గా బిగ్ బాస్ ఓటిటి ప్రోమో కూడా వచ్చేసింది. మరి వీకెండ్ లో కమల్ చేసే ఫన్, అలాగే కంటెస్టెంట్స్ ని క్రమశిక్షణలో పెట్టినట్లుగా శింబు కూడా హోస్ట్ గా ఇవన్నీ హ్యాండిల్ చేయగలడా.. లేదా.. అని ఇప్పుడు అందరూ క్యూరియాసిటీతో చూస్తున్నారు. 

Simbu to replace Kamal Haasan in Bigg Boss Ultimate:

Bigg Boss Ultimate: Simbu to replace Kamal Haasan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs