Advertisement
Google Ads BL

వలిమై థియేటర్ దగ్గర షాకింగ్ ఘటన


కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన వలిమై నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ సినిమాలు వస్తున్నాయంటే అభిమానులు థియేటర్స్ దగ్గర రచ్చ రచ్చ చేస్తారు. బ్యానెర్లు కట్టడం, పాలాభిషేకాలు.. అజిత్ కి పూలమాలలు వెయ్యడం, టపాసులు కాల్చడం.. ఇలా హడావిడి చేస్తారు. వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా, కార్తికేయ విలన్ గా నటించిన వలిమై సినిమా రిలీజ్ అయిన ఓ థియేటర్ దగ్గర పెట్రో బాంబు దాడి జరగడం, ఆ ఘటనలో అజిత్ అభిమానులు తీవ్రంగా గాయపడడం కలకలం సృష్టించింది.

Advertisement
CJ Advs

కోయంబ‌త్తూరులోని గంగ వ‌ల్లి మ‌ల్టీప్లెక్స్‌లో అజిత్ నటించిన వ‌లిమై సినిమా రిలీజ్ అయ్యింది. దానితో అజిత్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకుంటూ రచ్చ షురూ చేసారు. అదే టైం లో ఓ ముగ్గురు దుండగులు థియేటర్ లోకి ప్రవేశించి పెట్రోల్ బాంబు తో దాడి చెయ్యడంతో అజిత్ ఫాన్స్ ముగ్గురు గాయపడ్డారు. బైక్ పై వచ్చిన ఆ ముగ్గురు దుండగులు అనుకోకుండా దాడి చేసేసరికి అక్కడి వాతావరణం అంతా ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ దుండగులని అజిత్ ఫాన్స్ పట్టుకోవడానికి ట్రై చేసినా.. వారు తప్పించుకోవడంతో పోలీస్ లు వారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. 

అయితే పెట్రో దాడి కావాలనే చేసారని, అజిత్ ఫాన్స్ పై పగ తీర్చుకోవడానికే ఇలాంటి ఘటనపై పాలడ్డారని అంటున్నారు. ఈ ఘటన మాత్రం అక్కడివారిని భయబ్రాంతులకు గురి చేసింది అని చెబుతున్నారు.

Valimai movie theater attacked with petrol bombs:

Petrol bomb blast in front of the theater where Ajith Valimai
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs