భీమ్లా నాయక్ మానియా ప్రస్తుతం హైదరాబాద్ ని చుట్టేసింది. పవన్ ఫాన్స్ రచ్చ, భీమ్లా నాయక్ బుకింగ్ టికెట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ హడావిడి, నేడు యుఎస్ ప్రీమియర్స్ హడావిడి.. అబ్బో రెండు మూడు రోజులు భీమ్లా నాయక్ ఫీవర్ తో ఊగిపోవడం ఖాయంగా కనబడుతుంది. అయితే గత సోమవారం రిలీజ్ అయిన భీమ్లా నాయక్ ట్రైలర్ పై మిశ్రమ స్పందన వచ్చింది. భీమ్లా నాయక్ ట్రైలర్ లో పవన్ కన్నా ఎక్కువగా రానా ని హైలెట్ చెయ్యడం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో కాస్త అసంతృప్తి.. ఇలా ఫాన్స్ కాదు సాధారణ ఆడియన్స్ కూడా అనుకున్నారు. అదే విషయాన్ని కాంట్రవర్సీ దర్శకుడు ఆర్జీవీ ట్విట్టర్ లో తగులుకుని అది పవన్ సినిమాలా లేదు రానా సినిమాని ప్రమోట్ చేసినట్టుగా ఉంది.
పవన్ కళ్యాణ్ ని విలన్ ని చేసి రానా ని హీరోని చేసారు. హిందీలో రానాకి బాహుబలి ఇమేజ్ ఉంది.. దానిని క్యాష్ చేసుకోవడానికే ఇలాంటి ట్రైలర్ వదిలారు, భీమ్లా నాయక్ ఎందుకు, డ్యానియల్ శేఖర్ గా టైటిల్ పెట్టుకోండి అంటూ ఏకిపారేశారు. కానీ గత రాత్రి భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సర్ ప్రైజింగ్ గా భీమ్లా నుండి మరో ట్రైలర్ వచ్చింది. దానితో ఫాన్స్ కూల్ అయ్యారు. మాస్ కి ట్రైలర్ బాగా ఎక్కేసింది. ఆర్జీవీ అయితే.. భీమ్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ట్వీట్ చేసాడు. పవన్ ఫాన్స్ మధ్యన కోలాహలంగా అసాధారణ రీతిలో జరిగిన ఈ ఈవెంట్ లో పవన్ హుందాగా వ్యవహరించారంటూ, పవన్ ఎందుకు అంత పెద్ద హీరో అయ్యారో అర్ధమైంది అంటూ పొగిడేస్తూ ట్వీట్ చేసాడు.