భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర పవన్ కళ్యాణ్ ఫాన్స్ రచ్చ చూస్తే.. పవన్ భీమ్లా నాయక్ మానియా ఎంతెలా ఉందో తెలుస్తుంది. అమీర్ పేట నుండి యూసుఫ్ గూడా వచ్చే రోడ్స్ అన్ని పవన్ ఫాన్స్ తో, సిటీ పోలీస్ లతో కిక్కిరిసిపోయాయి. భీమ్లా నాయక్, పవన్ అంటూ వారు చేసే రచ్చ తో హైదరాబాద్ సిటీ దద్దరిల్లిపోతుంది. సాయంత్రం 6 గంటలకి మొదలైన ఈ ఈవెంట్ లో పవన్ ఫాన్స్ రచ్చ మధ్యన సుమ యాంకరింగ్ లో జానపద కళాకారుడు మొగిలయ్యని భీమ్లా ప్రొడ్యూసర్ నాగ వంశి, డైరెక్టర్ సాగర్ సన్మానించారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లైవ్ ప్రోగ్రాం జరుగుతుండగానే.. పవన్ కళ్యాణ్, కేటీఆర్ ఈ ఈవెంట్ కి ఎంట్రీ ఇచ్చారు.
మరి పవర్ ఫుల్ పొలిటీషియన్ కేటీఆర్, టాప్ హీరో కం పొలిటికల్ లీడర్ అయిన పవన్ కళ్యాణ్ కలిస్తే.. ఎలా ఉంటుందో, ఉండబోతుందో అనే ఆత్రుతకి తెర దించుతూ.. కేటీఆర్, పవన్ కళ్యాణ్ పక్క పక్కనే కూర్చుని ఈవెంట్ ని ఎంజాయ్ చెయ్యడమే కాదు.. కేటీఆర్, పవన్ కబుర్లు చెప్పుకుంటూ ఆహ్లాదంగా నవ్వుకుంటూ కనిపించారు. కేటీఆర్, పవన్ అంత ఆత్మీయంగా మాట్లాడుకోవడం చూసిన పవన్ ఫాన్స్, టిఆర్ ఎస్ అభిమానులు అంత కేరింతలు కొడుతున్నారు.