Advertisement
Google Ads BL

భీమ్లా కి అన్ని అలా కలిసొస్తున్నాయ్


పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ క్రేజ్ ఎంతెలా ఉందో.. ప్రస్తుతం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ దగ్గర పవన్ ఫాన్స్ ని చూస్తే అర్ధమవుతుంది. మధ్యాన్నం మూడు గంటల నుండే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఫాన్స్ ఎదురు చూపులు, క్యూ, అక్కడ అభిమానుల కోలాహలం చూసినవాళ్ళకి తెలుస్తుంది ఆ మానియా. భీమ్లా నాయక్ ఈవెంట్ లో పవన్ స్పీచ్, అక్కడ గెస్ట్ గా రాబోతున్న కేటీఆర్ - పవన్ కళ్యాణ్ పక్కపక్కన నిలబడితే చూడాలనుకునే అతృతతో ఎదురు చూస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇక భీమ్లా నాయక్ అడ్వాన్స్ బుకింగ్ లో ఒక్క హైదరాబాద్ సిటీలోనే రికార్డులు సృష్టిస్తుంది. బుక్ మై షో లో భీమ్లా నాయక్ టికెట్స్ ఓపెన్ అవడమే కోటి మార్క్ దాటేసి.. ఒక్క రోజులో మూడున్నర కోట్ల మార్క్ తో భీమ్లా నాయక్ రికార్డు సృష్టించగా.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం భీమ్లా నాయక్ సినిమాకి తెలంగాణాలో రెండు వారాల పాటు ఐదో షో కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో భీమ్లా నాయక్ మేకర్స్, ఆయన ఫాన్స్ ఖుషీగా ఉన్నారు. అటు ఏపీలో కూడా థియేటర్స్, టికెట్ రేట్స్ ఇష్యు సద్దుమణగడం,(ఇంకా రేట్స్ పెరగలేదు) 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ రావడంతో.. భీమ్లా మేకర్స్ ఫుల్ ఖుషీగా సినిమా ని ఆడియన్స్ ముందుకు తేబోతున్నారు. 

Telangana Government Grants Permission for Bheemla Nayak 5th Show.:

Telangana Government Grants Permission for Bheemla Nayak 5th Show.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs