Advertisement
Google Ads BL

భాగ్యనగరంలో భీమ్లా జాతర


నిన్నటి వరకు బుక్ మై షో ఓపెన్ అవ్వకపోవడంతో కాస్త నిరాశ పడిన పవన్ ఫాన్స్.. బుక్ మై షో వివాదానికి తెరపడి అది ఓపెన్ అవడంతో.. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అడ్వాన్స్ బుకింగ్ లో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. నిన్న మంగళవారం బుక్ మై షో ఓపెన్ అయిన కొద్దిసేపట్లోనే హైదరాబాద్ సిటీ లో కోటి మార్క్ దాటిన భీమ్లా నాయక్ అడ్వాన్స్ బుకింగ్.. ఫస్ట్ డే 3.5 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. భాగ్యనగరంలో భీమ్లా నాయక జాతర ఏ రేంజ్ లో మొదలైందో.. ఈ ఒక్క ఉదాహరణ చాలు.

Advertisement
CJ Advs

మరో రెండు రోజుల్లో ఆడియన్స్ ముందుకి రాబోతున్న భీమ్లా నాయక్ క్రేజ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉంది. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో కేటీఆర్ ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఇప్పటికే భీమ్లా నాయక్ ఈవెంట్ కోసం నిర్వాహకులు యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో భారీ ఏర్పాట్లు చేసారు. అంతేకాకుండా పోలీస్ లు అటుగా వెళ్లే వాహనాలు దారిమళ్లించారు. పవన్ ఫాన్స్ జాతర, హడావిడిలో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా సిటీ పోలీస్ లు ముందు జాగ్రత్తగా మైత్రి వనం నుండి యూసుఫ్ గూడా చెక్ పోస్ట్ మీదుగా వెళ్లే వాహనాలని శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగగమనం మీదుగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కి దారి మళ్లించారు.

Hyderabad gripped with Bheemla Nayak fever:

Bheemla Nayak mania in Hyderabad
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs