Advertisement
Google Ads BL

బ్యూటిఫుల్ హీరోయిన్స్: సింగిల్ ఫ్రేమ్ లో


ఇద్దరు అందమైన హీరోయిన్స్, క్రేజీ హీరోయిన్స్, టాప్ హీరోయిన్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులే ఉండవు. సౌత్ లో నెంబర్ వన్ రేస్ లో ఉన్న సమంత - నయనతార ఒకే ఫ్రెమ్ లో అంటే ఫాన్స్ ఆగుతారా.. అస్సలాగరు. సమంత - నయనతార వెండితెర మీద స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా కాథువాక్కుల రెండు కాదల్ అనే సినిమాలో వారిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ మధ్యనే రిలీజ్ అయిన కాథువాక్కుల రెండు కాదల్ లుక్ అండ్ టీజర్ లో సమంత - నయనతార లు విజయ్ సేతుపతి తో చేసిన రొమాన్స్ విపరీతంగా హైలెట్ అయ్యింది. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా డైరెక్టర్ విగ్నేష్ శివన్ ఓ బ్యూటిఫుల్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అందులో సమంత ని నయనతార గట్టిగా పట్టుకుని హుషారుగా కనిపిస్తున్న పిక్. సమంత గ్లామర్ డ్రెస్ లో ఉంటే.. నయన్ ట్రెడిషనల్ గా చుడిదార్ లో కనిపిస్తుంది. (ఫిబ్రవరి 22) 22.02.2022 స్పెషల్ డేట్ అంటూ విగ్నేష్ శివన్ నయనతార, సమంతలు ఉన్న పిక్ ని షేర్ చేసాడు. దానిని సమంత కూడా షేర్ చేస్తూ 2.2.2022 తేదీన 20:02 గంటలకు అంటూ ఆ పిక్ ని ఫాన్స్ తో పంచుకుంది. నయనతారకు నాకు ఉన్న స్పెషల్ ఫ్రెండ్ షిప్ అని.. నయన్ సోషల్ మీడియాలో లేదు.. ఆమె తరుపున కూడా అంటూ సమంత క్యాప్షన్ పెట్టింది. అలా సామ్ - నయన్ ల పిక్ ని చూసిన ఫాన్స్ ఇద్దరు ముద్దుగ్గుమ్ములు ఒకే ఫ్రేమ్ లో అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Nayanthara and Samantha are the new besties:

Nayanthara and Samantha Ruth Prabhu are the new besties in town
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs