Advertisement
Google Ads BL

ఇంట్రెస్టింగ్ గా దొంగలున్నారు జాగ్రత్త


మత్తువదలరా సినిమాతో మంచి పేరుతెచ్చుకుని.. తెల్లారితే గురువారం తో కాస్త డల్ అయిన సింహ కోడూరి మరో చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ తో వచ్చేసింది. అన్న కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్తా చాటుతుంటే, సింహ కోడూరి హీరోగా నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్నాడు. బిగ్ సినిమా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన సింహ కోడూరి.. సొంతగా హీరోగా ఎదగడానికి కష్టపడుతున్నాడు. సతీష్ త్రిపుర దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ - గురు ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న దొంగలున్నారు జాగ్రత్త మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది టీం.

Advertisement
CJ Advs

దొంగలున్నారు జాగ్రత్త సినిమా టైటిల్ మాత్రమే కాదు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. రోడ్డుపై కారు చిత్రంతో పాటు, సింహ కోడూరిని CC కెమెరా కేబుల్‌తో కుర్చీకి కట్టెయ్యడంతో అరుస్తూ ఫస్ట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇంకా టైటిల్ లోగోలో కొన్ని ఆకట్టుకునే అంశాలు కూడా ఉన్నాయి. ఈ వినూత్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రాజెక్ట్ పై క్యూరియాసిటీని పెంచుతుంది. ఈ సినిమాలో సింహ కోడూరి తో ప్రీతి అస్రాని రొమాన్స్ చేస్తుండగా.. సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు.

Dongalunnaru Jagratha First Look Unveiled:

Sri Simha Koduri, Satish Tripura, Suresh Productions, Guru Films Dongalunnaru Jagratha First Look Unveiled
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs