Advertisement
Google Ads BL

పవన్ - తారక్ కలిస్తే ఇలా ఉంటుంది.!


పవన్ - తారక్ అనగానే మీరు పవర్ స్టార్ - యంగ్ టైగర్ కాంబో ఆశించి ఉంటే వెరీ సారీ ఫర్ దట్. ఈ న్యూస్ నందమూరి యంగ్ టైగర్ తారక్ రిలేటెడ్ కాదు. తెలంగాణ టైగర్ కల్వకుంట్ల తారక రామారావు.. అలియాస్ అభిమానుల తారక్.. అలియాస్ అందరి KTR న్యూస్. 

Advertisement
CJ Advs

మరికొన్ని గంటల్లో జరగనున్న భీమ్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తోన్న విషయం ఇప్పటికే బాగా పాపులర్ అయింది. అనుకోని కారణాల రీత్యా ఈవెంట్ పోస్ట్ పోన్ అయినప్పటికీ మళ్ళీ తన టైమ్ అడ్జస్ట్ చేసుకుని మరీ పవన్ కోసం భీమ్లా నాయక్ వేడుకకు వస్తున్నారు కేటీఆర్. ఆయనతో బాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా రానున్నారు. ఇక ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గురించి చెప్పేదేముంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన అభిమానులు సృష్టించే కోలాహలం కొత్తేమీ కాదు కదా.

అయితే ఈ ప్రోగ్రాంలో స్పెషల్ అటెన్షన్ డ్రా చేస్తోన్న అంశం పవన్ - కేటీఆర్ ల కలయిక. పొలిటికల్ గా డిఫరెంట్ ఫ్లాట్ ఫామ్స్ లో నిలబడి ఉన్న వీరిద్దరూ జస్ట్ ట్రావెలర్స్ లాగా హాయ్ చెప్పుకుని, లేదా ఫ్రెండ్స్ లాగా హగ్ ఇచ్చుకుని ఎవరి దారిన వారు వెళతారా... లేక భవిష్యత్ లో ఒకే బాటలో పయనించనున్నామని ఇదే వేదిక నుంచి ఏమైనా సంకేతాలు ఇస్తారా అనే ఆసక్తి, ఆరాటం, ఆత్రుత విపరీతంగా ఉంది కొందరికి. 

సరే.. ఇంకొన్ని గంటల్లోనే అదంతా తేలిపోతుందిలే అని మనం సరిపెట్టుకోవచ్చు కానీ ఈ మీటింగ్ విషయంలో హైదరాబాద్ సిటీ పోలీస్ ఎంత కేర్ తీసుకుంటున్నారో, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో ఆ స్క్రీన్ షాట్ చూస్తేనే తెలుస్తోంది.

ఇక్కడ విశేషం ఏమిటంటే.. సినిమాలో కథ ప్రకారం ఆంధ్రాలోని శ్రీశైలం ఎస్సై అయిన భీమ్లా నాయక్ కి తెలంగాణ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం..!

Bheemla Nayak Pre Release Event Hungama:

HUge Arrangments For Bheemla Nayak Pre Relese Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs