బాలకృష్ణ - బోయపాటి కాంబో అంటేనే యాక్షన్. సింహ, లెజెండ్ యాక్షన్ ని మించిన మాస్ యాక్షన్ అఖండ లో చూపించింది ఈ కాంబో. అఖండ లో యాక్షన్ అంతకు మించి అన్న లెవల్లో సెకండ్ హాఫ్ లో చూపించారు. అఘోర గెటప్ లో బాలకృష్ణ విలన్స్ ని చీల్చి చెండాడారు. అలాంటిది గోపీచంద్ తో బాలయ్య చేస్తున్న మూవీలో యాక్షన్ డోస్ మరికాస్త ఎక్కువ పెంచారనే టాక్ వినిపిస్తుంది. గోపీచంద్ మలినేని - బాలకృష్ణ కాంబోలో మొదలైన NBK 107 మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ చూస్తే ఇట్టే అర్ధమవుతుంది.
బాలయ్య బ్లాక్ షర్ట్, లుంగీ, మాస్ లుక్ అన్ని ఈ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. అయితే ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తుంది. సినిమా మొత్తంలో బాలయ్య ఇద్దరి కేరెక్టర్స్ కి కలిపి దాదాపుగా 12 ఫైట్స్ డిజైన్ చేశారట రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. అసలు NBK 107 మొదలు పెట్టడమే యాక్షన్ సన్నివేశాలతోనే మొదలైంది. ఇక ఈ 12 ఫైట్స్ లో ఓ భారీ చేజ్ సీన్ కూడా ఉండబోతుందట. ఈ సీన్ కోసం ప్రత్యేకంగా యాక్షన్ టీం ని రంగంలోకి దింపినట్టుగా తెలుస్తుంది. వీరసింహ రెడ్డి కేరెక్టర్ లో బాలయ్య చెలెరిగిపోతారని.. గోపీచంద్ బాలయ్య పై యాక్షన్ ని వేరే లెవెల్ ప్లాన్ చేసారని అంటున్నారు.