Advertisement
Google Ads BL

ఆమెతో సంబంధం లేదంటోన్న నరేష్


సీనియర్ నటుడు నరేష్ తన మాజీ భర్త అయినా.. ఆయనకి సంబందించిన ఆస్తులు తనకే చెందుతాయని చెప్పి నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసి చీట్ చెయ్యడంతో ఆమెపై 5 గురు మహిళలు హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నరేష్ ఆస్తులు తనకే చెందుతాయని హిందూపూర్, అనంతపూర్, హైదరాబాద్ లో కొంతమంది ఆడవాళ్ళ నుండి డబ్బు వసూలు చేసి చీట్ చెయ్యడంతో ఆమె పై ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. 

Advertisement
CJ Advs

అయితే ఈ డబ్బు వసూలు విషయంలో తనకేం సంబంధం లేదని సీనియర్ నరేష్ చెబుతున్నారు. నరేష్ కి రమ్య మూడో భార్య. ఎనిమిదేళ్ల క్రితమే రమ్యని వివాహం చేసుకున్న నరేష్ ఆమెతో తర్వాత విడిపోయారు. నరేష్ నుండి విడిపోయిన రమ్య నరేష్ ఆస్తులని చూపిస్తూ  అధిక వడ్డీ పేరుతో, రిజిస్ట్రేషన్ల పేరుతో  కోట్లల్లో మోసానికి పాల్పడింది. చాలామంది మహిళల దగ్గర డబ్బు దండుకుని.. వారిని మోసం చెయ్యగా.. ఆమెపై కేసు నమోదు అయ్యింది. నరేష్ మాత్రం రమ్య వసూళ్ళకి తనకి ఎలాంటి సంబంధం లేదని మీడియా ముఖంగా చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

Case Filed Against Naresh Ex Wife Ramya Raghupathi:

Cases registered against actor Naresh ex-wife Ramya
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs