Advertisement
Google Ads BL

సింగిల్ సిటీలోనే కోటి దాటేసిన భీమ్లా


పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ జోరు మాములుగా లేదు. ఇటు డొమెస్టిక్ మార్కెట్ లోనూ అటు ఓవర్సీస్ సెంటర్స్ లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ అదరగొట్టేస్తున్నాయి. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ చూపించేలా ఉన్న భీమ్లా తెలుగు స్టేట్స్ లోనూ తోలి రోజు కలెక్షన్లలో కొత్త రికార్డులు రప్పించేలా ఉన్నాడు. భీమ్లా నాయక్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవడంతో.. భీమ్లా నాయక్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కోసం బుక్ మై షో లో హైదరాబాద్ ఫాన్స్ ఓ యుద్ధమే చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్ సిటీలోనే భీమ్లా నాయక్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో కోటి మార్క్ ని దాటేసింది. పవన్ ఫాన్స్ మాత్రమే కాదు.. మూవీ లవర్స్ అంతా భీమ్లా నాయక్ రిలీజ్ కోసం వెయిటింగ్. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ లోనే భీమ్లా నాయక్ తమ మార్క్ రికార్డుల వేట మొదలు పెట్టింది.

Advertisement
CJ Advs

భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ ఇచ్చేసి హడావిడిగా ప్రమోషన్స్ మొదలు పెట్టినా.. కొన్ని కారణాల వలన ఆ ప్రమోషన్స్ ఆపెయ్యాల్సి వచ్చినా.. కానీ ఒకే ఒక్క ట్రైలర్ తో భారీగా భీమ్లా నాయక్ ని ఆడియన్స్ లోకి తీసుకెళ్లగలిగారు మేకర్స్. భీమ్లా నాయక్ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచేసింది. పవన్ కళ్యాణ్ హీరోయిజం, రానా యాటిట్యూడ్ అన్ని సినిమాపై భీభత్సమైన హైప్ క్రియేట్ చేసాయి. ఇక రేపు సాయంత్రం యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్న ఈ వేడుకలో మరిన్ని సర్ ప్రైజ్ లు ప్లాన్ చేసారు మేకర్స్. 

Bheemla Nayak Advance Booking Report:

Bheemla Nayak Record Breaking Advance Bookings In Hyderabad City
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs