Advertisement
Google Ads BL

దగ్గుబాటి అభిరామ్-తేజల అహింస


దగ్గుబాటి ఫ్యామిలీ నుండి సిల్వర్ స్క్రీన్ కి హీరోగా తెరంగేట్రం చెయ్యబోతున్న సురేష్ బాబు కొడుకు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ తన ఫస్ట్ ఫిలిం ని డైరెక్టర్ తేజ డైరెక్షన్ లో చేస్తున్నాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల‌ను అందించి, ఎందరో ప్రతిభావంతులైన నటీనటులను పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకులు తేజ చేతుల మీదుగా అభిరామ్ గ్రాండ్ గా హీరోగా లాంచ్ అవుతున్నాడు. నితిన్, గోపీచంద్, మహేష్ లాంటి హీరోలు తేజ డైరెక్షన్ తర్వాత సక్సెస్ ఫుల్ హీరోలుగా దూసుకుపోతున్నట్టే దగ్గుబాటి అభిరామ్ కి ఈ సినిమా తర్వాత కెరీర్ ఫుల్ స్వింగ్ లో మొదలవుతుందేమో చూడాలి.

Advertisement
CJ Advs

తేజ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ రోజు ఈ సినిమా టైటిల్ మరియు ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అభిరామ్ వెండితెర ఎంట్రీ ఫిలిం కి అహింస అనే ఆస‌క్తిక‌ర టైటిల్‌ను క‌న్ఫ‌ర్మ్ చేశారు. ఈ టైటిల్ డిజైన్ చేయడానికి జూట్ బ్యాగ్ ఆకృతిని ఉపయోగించారు. ఈ పోస్ట‌ర్లో  ర‌క్తం కారుతున్న అభిరామ్ ముఖం జూట్ బ్యాగ్‌తో కప్పబడి ఉంది. అహింస ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయేలా ఉండడంతో సినిమాపై క్యూరియాసిటీ నెలకొంది.

ఆర్.పి.పట్నాయక్ ను సంగీత ద‌ర్శ‌కుడిగా తేజ ప‌రిచ‌యం చేశారు. వాళ్లిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఎన్నో చార్ట్ బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్స్ వ‌చ్చాయి. చాలా సంవత్సరాల తరువాత వాళ్లిద్ద‌రు మ‌ళ్లీ క‌లిసి ఈ చిత్రానికి ప‌నిచేయ‌బోతున్నారు. అహింస మూవీ షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.

Abhiram Ahimsa pre look released on Teja B-Day:

<div>Director Teja B-Day: Abhiram pre look out</div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs