Advertisement
Google Ads BL

కాజల్ సీమంతం వేడుక


సినిమాలకి భారీ బ్రేక్ ఇచ్చేసిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీని ఆస్వాదిస్తోంది. ఈమధ్యనే బేబీ బంప్ తో దర్శనమిచ్చి, గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేసిన కాజల్ అగర్వాల్.. బాడీ షేమింగ్ తో ట్రోల్స్ చేసే వారికి గట్టిగా ఇచ్చిపడేసింది. ప్రెగ్నెన్సీ తర్వాత శరీరంలో రకరకాల మార్పులు వస్తాయని, అవి బిడ్డ పుట్టేవరకు ఉండడమే కాకుండా.. బిడ్డ పుట్టాక కూడా ఉంటాయని, వ్యాయామంతో కొంతమంది సాధారణ స్థితికి వస్తే.. మరికొందరు అలాగే ఉంటారని, అలాంటి ట్రోలింగ్ టెంక్షన్ తో బిడ్డ పుట్టే మధుర క్షణాలను వదులుకోవద్దు అని, ఆ ఒత్తిడి పెంచుకోవద్దు అంటూ కాబోయే తల్లులకి కాజల్ సలహాలు ఇచ్చింది.

Advertisement
CJ Advs

ఇక ఈమధ్యనే దుబాయ్ వెకేషన్స్ ని పూర్తి చేసుకుని వచ్చిన కాజల్ ఆమె భర్త గౌతమ్ కిచ్లు లు.. కాజల్ సీమంతం వేడుకని అదిరిపోయే రేంజ్ లో నిర్వహించారు. కాజల్ సీమంతం వేడుకల ఫొటోస్ చూస్తే కాజల్ ఆనందాన్ని వర్ణించవచ్చు. కాజల్ చెల్లి నిషా అగర్వాల్, కాజల్ భర్త గౌతమ్ కిచ్లు అలాగే కాజల్ పేరెంట్స్ ఇంకా కొంతమంది సన్నిహితులు మాత్రమే హాజరైన కాజల్ సీమంతం వేడుక అంగరంగ వైభవంగా జరగగా.. ఆ వేడుకలో కాజల్ సంతోషం ఫొటోస్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.   

Kajal Godh Bharai function celebrated:

<span>Kajal baby shower function performed</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs