మొన్నామధ్యన పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ ని తొక్కేస్తుంది.. అంటూ మాట్లాడి జగన్ ప్రభుత్వాన్ని, వైసిపి మంత్రులని తన స్పీచ్ తో ఓ ఆట ఆడుకున్నారు. అది ఏపీ మంత్రులకి నచ్ఛలేదు. ఇండస్ట్రీలో కూడా చాలామంది పవన్ వ్యాఖ్యలకి ఇండస్ట్రీకి సంబంధం లేదని మాట్లాడారు. అప్పటి నుండి జగన్ చుట్టూ ప్రదక్షణలు చేస్తూ టికెట్ రేట్స్ ఇష్యు కోసం తపన పడ్డారు. కానీ చివరికి చిరంజీవి, ప్రభాస్, మహేష్ వెళితేనే గాని సీఎం జగన్ ఈ సమస్యకి పరిష్కారాన్ని చూపారు. అక్కడ చిరు చేతులు కట్టుకుని జగన్ ని అడుక్కోవడం తమకి నచ్ఛలేదంటూ అప్పట్లో చాలామంది అన్నారు. కొంతమంది చిరు సమస్యని పరిష్కరించి పెద్దన్నలా వ్యవహరించారు అంటే.. కొందరు అక్కడ చిరు దేహి అనడం నచ్చలేదు అన్నారు. పెద్ద పెద్ద స్టార్స్ వెళ్లబట్టే సీఎం జగన్ ఈగో శాటిస్ఫాయ్ అయ్యింది అన్నారు కూడా..
తాజాగా పవన్ కళ్యాణ్ మత్య కారుల సభలో పాల్గొనేందుకు నరసాపురం వెళ్లారు. అక్కడ సభలో మట్లాడుతూ.. జగన్ తో చిరు అండ్ కో సమావేశం పై పరోక్షంగా కెలికేసారు. సమస్యని పెద్దది చేసి చూపుతూ.. పెద్ద వ్యక్తులని తమ దగ్గరకి రప్పించుకుని చేతులు కట్టుకుని తమ ముందు మోకరిల్లితేనే .. తమ ఈగో శాటిస్ ఫై అయ్యి సమస్యల పరిష్కారానికి ఓ మార్గం చూపిస్తారు జగన్ మోహన్ రెడ్డి అంటూ పవన్ ఇండస్ట్రీ సమస్యల్ని కెలకడమే కాదు, తన అన్న చిరు అలా జగన్ రెడ్డి కి ఒంగి ఒంగి దండాలు పెట్టడం తనకి నచ్చలేదు అంటూ పవన్ ఇండైరెక్ట్ గా చెప్పినట్లుగా ఉంది. దానితో టాలీవుడ్ సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ లోనే మళ్ళి మాట్లాడుకునే అవకాశం పవన్ ఇచ్చారు.