Advertisement
Google Ads BL

మహేష్ కూతురా మజాకానా


మహేష్ బాబు కూతురు సితార అంటే తెలియని వారే లేరు. సితార క్యూట్ ఫోటో షూట్స్, అలాగే మహేష్ తో సితార స్పెండ్ చేసే పిక్స్ ని నమ్రత ఎప్పుడూ సోషల్ మీడియా లో షేర్ చేస్తుంది. స్పెషల్ కిడ్, సెలెబ్రిటీ కిడ్ గా సితార కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. గౌతమ్ ఇంట్లో పిల్లిలా ఉంటే సితార మాత్రం తాట తీసేస్తుంది అని, అలాగే ఎక్కడికన్నా వెళదామని అది మిస్ అయితే ఇల్లు పీకి పందిరి వేస్తుంది అంటూ ఈమధ్యనే మహేష్ ఓ టాక్ షో లో తన కూతురు సితార గురించి చెప్పారు. ఇక సితార మంచి డాన్సర్, ఆమె వంశి పైడిపల్లి కూతురు ఆద్య తో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తున్న విషయం తెలిసిందే. 

Advertisement
CJ Advs

మహేష్ బాబు నటించిన సినిమాల్లోని సాంగ్స్ ని సితార రీ క్రియేట్ చేస్తూ ఉంటుంది. గతంలో సరిలేరు నీకెవ్వరూ సినిమాలో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ కి స్టెప్స్ వేసి ఔరా అనిపించింది. కొన్ని సాంగ్స్ కి రీల్స్ కూడా చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటుంది సితార. ఇప్పుడు కూడా ఇదే చేసింది. సర్కారు వారి పాట సినిమాలోని కళావతి పాట స్టెప్ రీల్ చేసింది సితార. మహేష్ - కీర్తి సురేష్ ల సర్కారు వారి పాటలోని కళావతి సాంగ్ రికార్డ్ వ్యూస్ ని కొల్లగొడుతుంది. ఆ సాంగ్ ని సితార రీ క్రియేట్ చేస్తూ వేసిన డాన్స్ స్టెప్స్ నిజంగా క్యూట్ గా ఉన్నాయి. సితార వేసిన స్టెప్స్ చూసిన వారు మహేష్ కూతురా మజాకానా అంటున్నారు. పింక్ కలర్ టీ షర్ట్ వేసుకుని పింక్ షూస్ తో సితార క్యూట్ గా వేసిన కళావతి సాంగ్ డాన్స్ స్టెప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Mahesh babu daughter Sitara cute dance to Kalavathi song:

Mahesh Babu daughter Sitara beautiful dance on kalavathi song
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs