ప్రస్తుతం సర్కారు వారి పాటలో కళావతిగా కనువిందు చేస్తున్న కీర్తి సురేష్ రేపటినుండి గాంధారిగా తన నాట్య విన్యాసాన్ని చూపిస్తా అంటుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ బృంద నేతృత్వంలో సోని మ్యూజిక్ గాంధారి పేరుతొ ఓ మ్యూజిక్ వీడియోని గ్రాండ్ గా రెడీ చేసింది. కీర్తి సురేష్ గాంధారి మ్యూజిక్ వీడియో ని రేపు అఫీషియల్ గా లాంచ్ చెయ్యబోతున్నారు. లాస్ట్ ఇయర్ లవ్ స్టోరీ లోని సాయి పల్లవి నర్తించిన సారంగ దరియ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.
250 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకున్న సారంగ దరియ సాంగ్ ని క్రియేట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సిహెచ్, ఆ సాంగ్ కి లిరిక్స్ రాసిన సుద్దాల అశోక్ తేజ మళ్ళీ గాంధారి సాంగ్ కోసం కలిశారు. మరో సారంగ దరియాని సిద్ధం చేసారు. రీసెంట్ టైం లో సరైన సక్సెస్ లు లేక కాస్త డల్ అయిన కీర్తి సురేష్ తన యాక్టింగ్ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి సర్కారు వారి పాటని ఎంచుకుంది. తన డాన్స్ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి గాంధారి రూపంలో ఓ ప్లాట్ ఫామ్ సిద్ధం చేసుకుంది. రేపటి నుండి గాంధారిగా కీర్తి సురేష్ పెర్ఫరామెన్స్ ని, తన నాట్య విన్యాసాన్ని చూడబోతున్నాం. మరి ఈ సాంగ్ ఎన్ని మిలియన్ వ్యూస్ కొడుతోంది.. కీర్తి సురేష్ ఎంతగా ఫిదా చేస్తుంది అన్నది చూద్దాం.