Advertisement
Google Ads BL

చిరు - వెంకీ స్టోరీ లైన్ సీక్రెట్


మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోల కన్నా స్పీడుగా వరస ప్రాజెక్ట్స్ తో దుమ్ములేపుతున్నారు. ఆచార్య ని రిలీజ్ కి రెడీ చేసిన చిరు.. తర్వాత మోహన్ రాజా గాడ్ ఫాదర్, మెహర్ రమేష్ భోళా శంకర్ షూటింగ్స్ ని పారలల్ గా చేస్తున్నారు. అలాగే బాబీ దర్శకత్వంలోని ప్రాజెక్ట్ కూడా పూజ కార్యక్రమాలతో మొదలైంది. ఆ తర్వాత వెంకీ కుడుముల సినిమాకి మెగాస్టార్ ఓకె చెప్పి అఫిషియల్ ప్రకటన ఇచ్చారు. ఛలో, భీష్మ సినిమాలని కామెడీ ఎంటర్టైనర్ గా మలిచిన తీరు మెగాస్టార్ కి నచ్చడంతో వెంకీ తో ప్రాజెక్ట్ ఓకె చేసారు.

Advertisement
CJ Advs

అయితే వెంకీ కుడుముల చిరు తో చెయ్యబోయే మూవీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గానే తెరకెక్కించబోతున్నాడట. ఈ సినిమాలో చిరు రోల్ చాలా జాయ్ ఫుల్ గా ఉండబోతుందట. వెంకీ కుడుముల ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో తలమునకలై ఉన్నాడట. చిరు పాత్రని శంకర్ దాదా ఎంబిబిఎస్ కంటే ఎక్కువ హ్యూమర్ ఉండేలా డిజైన్ చేస్తున్నాడట. ఈ సినిమా కథ మొత్తం రాయలసీమ నేపథ్యంలో సాగుతుందని.. ఇందులో చిరంజీవి క్యారెక్టర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌గా ఉంటుందని తెలుస్తుంది. ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ ప్రాజెక్ట్ అన్ని యాక్షన్ ఆధారంగా తెరకెక్కుతున్నాయి.. సో ఇలాంటి కామెడీ ఎంటర్టైనర్ చేస్తే కాస్త ఫ్రెష్ గా ఉంటుంది అని చిరు భావించి వెంకీ కథకి ఓకె చెప్పేశారట. 

Chiru - Venky Storyline Secret:

Megastar Chiranjeevi, Venky Movie Story Leaked
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs