Advertisement
Google Ads BL

క్రెడిట్ అంతా త్రివిక్రమ్ కే


అయ్యప్పను కోషియమ్ సినిమాని రీమేక్ చెయ్యమని త్రివిక్రమ్ చెప్పి ఒప్పించడంతోనే పవన్ కళ్యాణ్ ఆ సినిమా ఒప్పుకున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమాకి భీమ్లా నాయక్ టైటిల్ పెట్టడం దగ్గర నుండి మిగతా పనులన్నీ త్రివిక్రమ్ చేతుల మీదే జరుగుతున్నాయి.  సాగర్ కే చంద్ర భీమ్లా నాయక్ డైరెక్టర్. కానీ అక్కడ అన్ని త్రివిక్రమే. స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్ గా త్రివిక్రమ్ ఆల్మోస్ట్ భీమ్లా సెట్స్ లోనే గడిపేస్తున్నారు. భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ దగ్గర నుండి ప్రమోషన్స్ వరకు అన్ని త్రివిక్రమ్ ప్లానింగ్ లోనే జరుగుతున్నాయట. పవన్ కి మంచి ఫ్రెండ్, సితార ఎంటర్టైన్మెంట్ కి కావాల్సిన వాడు త్రివిక్రమ్. అందుకే అన్ని తానై.. భీమ్లా నాయక్ రిలీజ్ విషయంలో కష్టపడుతున్నారు ఆయన.

Advertisement
CJ Advs

ఆఖరికి భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ ని ఇన్వైట్ చెయ్యడానికి కూడా నిర్మాత చినబాబు తో పాటుగా త్రివిక్రమే వెళ్లారు. ఆయన్ని ఇన్వైట్ చేసి థాంక్స్ చెప్పి వచ్చారు. మరి భీమ్లా నాయక్ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకుడైన క్రెడిట్ అంతా త్రివిక్రమ్ కే వెళ్ళిపోతుంది. ఒకవేళ భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ హిట్ అయినా.. అది పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ కే వెళుతుంది. కానీ సాగర్ ఎక్కడా హైలెట్ అవ్వడు. పాపం భీమ్లా నాయక్ ని కష్టపడి తీసింది ఆయనే.. కానీ క్రెడిట్ మాత్రం ఆయనకి దక్కేలా కనిపించడం లేదు. 

All credit goes to Trivikram:

Bheemla Nayak credit goes to Trivikram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs