ఎటువంటి అంచనాలు, హైప్ లేకుండా ఇండియన్ బాక్సాఫీసు దగ్గర సంచనాలు సృష్టించి, మేకర్స్ కి లాభాల పంట పండించిన కెజిఎఫ్ మూవీ తో యశ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కెజిఎఫ్ లో హీరోకిచ్చిన ఎలివేషన్ సీన్స్ తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ గా తెలుగు స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. యశ్ - ప్రశాంత్ నీల్ కాంబోలో కెజిఎఫ్ 2 భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 14 న రిలీజ్ అవ్వబోతున్నట్లుగా ఎప్పుడో డేట్ ఇచ్చారు. అయితే అదే ఏప్రిల్ 14 న తమిళం నుండి బీస్ట్, బాలీవుడ్ నుండి జెర్సీ మూవీస్ రాబోతున్నాయి. ఆ సినిమాలు రిలీజ్ డేట్స్ ఇచ్చినప్పుడే యశ్ - ప్రశాంత్ నీల్ లు కెజిఎఫ్ 2 రిలీజ్ వాయిదా వేస్తారేమో.. లేదంటే పాన్ ఇండియా మూవీ కాబట్టి బాలీవుడ్, తమిళ్ లో దెబ్బ పడుతుంది అని అనుకున్నారు. కానీ ప్రశాంత్ నీల్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు.
కానీ ఇప్పుడు కెజిఎఫ్ 2 మూవీ ఏప్రిల్ 14 నుండి వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా ఇన్ సైడ్ టాక్. దానితో యశ్ ఫాన్స్ నిరాశ పడిపోతున్నారు. కెజిఎఫ్ కోసం కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ఫాన్స్ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది అనగానే డిస్పాయింట్ అవుతున్నారు. ఇంతకీ వాయిదా ఎందుకంటే కెజిఎఫ్ 2 లో యశ్ ఇంట్రడక్షన్ సాంగ్ అనుకున్నట్లుగా రాలేదని.. దానిని మళ్లీ రీ షూట్ చేసేందుకు హైదరాబాద్ లో ఓ ఐదు రోజులు పాటు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ సాంగ్ చిత్రీకరణ పూర్తయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అయ్యే ఛాన్స్ ఉంది అని.. సో సినిమా ఆ లెక్కన వాయిదా పడొచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు.