మోహన్ బాబు కి కోపం వచ్చింది. ఆయనకి కోపం తెప్పించింది తనపై, తన ఫ్యామిలీపై ట్రోల్స్ చేసేవారు. గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ ఇండస్ట్రీ సమస్యల విషయంలో ఏదో ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడడం, సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ దగ్గరకి వెళ్లినవారి గురించి మాట్లాడుతుండడం, అలాగే వారు నటించిన సినిమాలు సక్సెస్ కాకపోవడం, మా అధ్యక్ష ఎన్నికలను పొలిటికల్ ఎన్నికల్లా మార్చేశారంటూ మంచు ఫ్యామిలీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఈమధ్యనే ఇద్దరు హీరోలు తన మీద పనిగట్టుకుని 100 మందిని అపాయింట్ చేసుకుని మరీ తనపై ట్రోల్స్ చేస్తున్నారంటూ సంచలనంగా మట్లాడారు.
ఇక మోహన్ బాబు నటించిన సన్ అఫ్ ఇండియా ఫలితం కూడా తేడా కొట్టడంతో ఆ ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. దానితో మోహన్ బాబు కి కోపం వచ్చింది. ఇలాంటి ట్రోల్స్ చేసే వారిపై పరువు ష్టం దావా వేస్తాను అని, పది కోట్ల పరువు నష్టం వేస్తాను అని, యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా లో ఈ దాడి ఎక్కువైంది.. వాటిని వెంటనే వాటిని తొలగించకపోతే పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒకవేళ ఇలాంటి ట్రోలింగ్ ఆపకపోతే సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేస్తామని, పోలీసులను కూడా సంప్రదిస్తామని హెచ్చరించారు.