మంచు మోహన్ బాబు ఇండస్ట్రీ లోని కొంతమంది హీరోలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. ఆయన నటించిన సన్ అఫ్ ఇండియా ఇంటర్వ్యూలో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి తో భేటీకి తనకి ఆహ్వానం ఉంది అని.. కావాలనే కొంతమంది తనని అవాయిడ్ చేసారని అన్నారు. తాను ఇండస్ట్రీ అంతా కలిసి కట్టుగా పోరాడితేనే టికెట్ రేట్స్ ఇష్యు, సినిమా ఇండస్ట్రీ సమస్యలు తీరుతాయని బహిరంగ లేక రాస్తే.. ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదని, నటులంతా బిజీగా ఉన్నారన్నారు. ఎంత బిజీ అయినా.. కుదుర్చుకుని ఆ విషయం మీద చర్చించడానికి రావాలి. కానీ రాలేదు. ఎందుకంటే ఈగో.
అసలు నిజం చెప్పాలి అంటే నేనే గొప్ప అనే అహంకారం వలనే అందరం కలవలేకపోతున్నాం. గతంలో ఇలా ఉండేది కాదు.. అన్ని పరిశ్రమల హీరోలు కూర్చుని సమస్య పరిష్కారానికి చర్చించేవారు. మొన్నటికి మొన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో టికెట్ రేట్స్ పై చర్చించాలని సినిమా పరిశ్రమ నుండి కొంతమంది వెళ్లారు. నన్ను కూడా చర్చలకు రాలవాలని సీఎంఓ నుండి ఆహ్వానం ఉంది. కానీ ఆ విషయం నాకు చేరవేయలేదు. నాకు చెప్పలేదు. రమ్మనలేదు. వాళ్ళు పిలిచినా పిలవకపోయినా.. నాకంటూ ఓ చరిత్ర ఉంది. ఓ గౌరవం ఉంది. బయట రాజకీయాలకన్నా.. సినిమా ఇండస్ట్రీలో పాలిటిక్స్ ఎక్కువయ్యాయి. ఎవరిని నేను పట్టించుకోను, నా పని నేను చేసుకుంటాను. చేతనైనంత సహాయం చేస్తాను అంటూ మోహన్ బాబు ఆ ఇంటర్వ్యూలో సంచలనంగా మాట్లాడారు.