Advertisement
Google Ads BL

బన్నీని కలవరిస్తున్న బాలీవుడ్ భామ


పుష్ప సినిమాతో బాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ సెట్ చేసుకున్నాడు బన్నీ. చిన్న చిన్న ప్రమోషన్స్ తోనే పుష్ప సినిమాని అక్కడ 100 కోట్ల మార్క్ దాటించిన ఘనతని మూటగట్టుకున్నాడు. పుష్ప సినిమా చూసిన బాలీవుడ్ స్టార్స్ బన్నీ ని పొగడడమే పనిగా పెట్టుకున్నారు. క్రికెటర్స్ పుష్ప సాంగ్ స్టెప్స్ తో ఉర్రుతలూగిస్తున్నారు. హీరోయిన్స్ అయితే బన్నీ తో ఎప్పుడెప్పుడు సినిమాలు చెయ్యాలా అని ఆరాటపడిపోతున్నారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే అల్లు అర్జున్ అంటే ఇష్టమని, ఆయనతో నటించాలని ఉంది అంది. అలాగే అలియా భట్ అయితే అల్లు అర్జున్ తో నటించాలనేది తన ఫ్యామిలీ డిమాండ్ అని చెప్పింది. పుష్ప సినిమా చూసాక ఫ్యామిలీ అంతా ఆలు అల్లు తో సినిమా ఎప్పుడు అని ఆడుతున్నారని చెప్పింది.

Advertisement
CJ Advs

రీసెంట్ గా గంగూభాయ్ కతీయవాడి ప్రమోషన్స్ లో అలియా భట్ మరోసారి బన్నీని కలవరించింది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాను అని.. రామ్ చరణ్ తో తాను మొదటిసారి తెలుగులో నటించడం హ్యాపీగా ఉంది అని, ఆ తర్వాత ఎన్టీఆర్ తో నటిస్తే బావుండు అనుకున్నాను అని, ఎన్టీఆర్ చాలా గొప్ప డాన్సర్ అని.. అలా వెంటనే కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చారని.. త్వరలోనే NTR30 మొదలు కాబోతుంది అని చెప్పిన అలియా భట్.. ఎన్టీఆర్ తర్వాత బన్నీ తో కూడా సినిమా చేస్తే బావుంటుంది అని భవిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. కేరెక్టర్ లో బన్నీ ఇన్వాల్వ్ అయ్యే విధానం సూపర్, ఆయన డాన్స్ అద్భుతం. బన్నీ తో కలిసి యాక్ట్ చెయ్యాలనేది తన కోరిక అని చెప్పిన అలియా భట్.. బన్నీతో తన సినిమా ఎలా ఉండాలో కూడా చెప్పింది.

బన్నీ నేను కలిసి నటించే సినిమా కోసం ఒక స్టోరీ లైన్ కూడా అనుకున్నాను. ఇద్దరం కలిసి దుష్టశక్తులపై పోరాడే కథ అది. బన్నీతో కలిసి నటించే ఛాన్స్ కూడా త్వరలోనే వస్తుందని అనుకుంటున్నాను.. అంటూ అలియా భట్ బన్నీతో ఎలాంటి సినిమాలో నటించాలనుకుంటుందో కూడా చెప్పేసింది.

Alia Bhatt Wants To Act With Iconic Star Allu Arjun:

Alia Bhatt Reveals The Kind Of Film She Wants To Do With Allu Arjun: We Come Together & Fight The Bad Guys
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs