అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. శతమానం భవతి, హలో గురూ ప్రేమ కోసమే వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం బటర్ ఫ్లై.
జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్‌పై గంటా సతీష్ బాబు దర్శకత్వంలో రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం (ఫిబ్రవరి 18) అనుపమ పరమేశ్వరన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌ను గమనిస్తే చేతులు కట్టుకుని నిలబడిన అనుపమ, ఏదో విషయం గురించి ఆలోచిస్తోంది. ఆమె వెనుక సీతాకోక చిలుక రెక్కలున్నాయి. ఆ రెక్కల్లో అందమైన రంగులను మనం గమనించవచ్చు. ఇటు యువత, అటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్.
కాగా ఈ చిత్రానికి డైలాగ్ రైటర్ : దక్షిణా మూర్తి, లిరిక్ రైటర్ : అనంత శ్రీరామ్, ఆర్ట్ : విజయ్ కుమార్ మక్కెన, ఎడిటర్ : మధు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : నారాయణ, ప్రొడక్షన్ మేనేజర్ & డిజైనర్ : పోతరాజు పాంచజన్య, పి.ఆర్.ఓ: వంశీ కాకా, సినిమాటోగ్రపీ : సమీర్ రెడ్డి , మ్యూజిక్ : అరవింద్ షారోన్ (అర్విజ్), గిడోన్ కట్టా, నిర్మాతలు : రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీణ్ నల్లిమెల్లి, స్టోరి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : గంటా సతీష్ బాబు.
Advertisement
CJ Advs
Gen Next Movies Butter Fly Film With Anupama Parameswaran