బుట్ట బొమ్మ నుంచి శ్రీ వల్లీ సాంగ్ వరకూ అల్లు అర్జున్ డాన్సుని ఎంతమంది అనుకరిస్తూ ఆనందిస్తున్నారో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. నాటు నాటు పాటలోని తారక్ - చరణ్ ల స్టెప్పుకి కూడా ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తుండడం తెలిసిందే. ఇప్పుడదే కోవలోకి చేరింది తమిళ స్టార్ హీరో విజయ్ అరబిక్ కుతు సాంగ్. విజయ్ తాజా చిత్రమైన బీస్ట్ లోని సదరు పాటని ఫిబ్రవరి 14 న విడుదల చేయగా క్షణాల్లో వైరల్ అయిపోయి విశేషమైన స్పందన రాబట్టుకుంది. విజయ్ సరసన పూజ హెగ్డే గ్లామర్ తో పాటు అనిరుధ్ మ్యూజిక్, మరో తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ స్వయంగా లిరిక్ రాయడం వంటి క్రేజీ థింగ్స్ ఈ అరబిక్ సాంగ్ కి అస్సెట్ అయ్యాయి... ఇప్పటికే దాదాపు 50 మిలియన్ల వ్యూస్ తెచ్చేసాయి. ఇప్పుడిక ప్రస్తావించాల్సిన అసలు విషయం ఏంటంటే..
విజయ్ వంటి మాస్ హీరో సొంగుకి తన ఫ్యాన్స్ చిందులేయ్యడం కామనే కానీ సమంత వంటి స్టార్ హీరోయిన్ కూడా అరబిక్ స్టెప్పులతో ఆ పాట తననెంతగా ఆకట్టుకుందో చాటడం విశేషం. ఓవైపు సమంత చేసిన లేటెస్ట్ సెన్సేషనల్ సాంగ్ ఊఁ అంటావా మావ ఊపు సామజిక మాధ్యమాల్లో నేటికీ ధాటిగానే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సమంత మరో సాంగుకి కాలు కదపడంతో ఇప్పుడా స్మాల్ క్లిప్ సైతం విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఈ సమంత సరదాని మనసారా ఆస్వాదించే వీల్లేకుండా మాస్క్ అడ్డం పడిందనీ.. సామ్ క్యూట్ ఎక్సప్రెషన్స్ మిస్ అయ్యామనీ కామెంట్స్ సెక్షన్ లో కంప్లైంట్ చేసేస్తూ వాపోతున్నారు వ్యూవర్స్..!!