Advertisement
Google Ads BL

బ‌బ్లీ బౌన్సర్ గా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా


ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ధుర్ భండార్క‌ర్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప్ర‌క‌టించారు. మిల్కీబ్యూటీగా అన్ని భాషల్లోనూ అభిమానుల్ని పొందిన త‌మ‌న్నాతో బ‌బ్లీ బౌన్సర్ అనే బాక్సింగ్ నేప‌థ్యం ఉన్న చిత్రాన్ని మ‌ధుర్ భండార్క‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చ‌ర్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ తాజాగా పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది.

Advertisement
CJ Advs

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు మ‌ధుర్ భండార్క‌ర్ మాట్లాడుతూ గ‌తంలో తాను తెర‌కెక్కించిన సినిమాల‌కు భిన్నంగా బ‌బ్లీ బౌన్స‌ర్ ఉండ‌నుంద‌ని, బాక్స‌ర్స్ టౌన్ గా పేరుగాంచిన అసోలా ఫ‌తైపూర్ బ్యాక్ డ్రాప్ లో బాక్సింగ్ నేప‌థ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్న‌ట్లుగా తెలిపారు. మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఈ సినిమాలో ఓ మ‌హిళ బౌన్స‌ర్ గా న‌టిస్తున్నార‌ని, భార‌త‌దేశంలో తొలిసారిగా ఓ మ‌హిళ బౌన్స‌ర్ క‌థ ఆధారంగా వ‌స్తున్న తొలిసినిమా ఇదే అని, ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని మధుర్ అన్నారు.

అనంతరం చిత్ర క‌థ‌నాయ‌క త‌మ‌న్నా మ‌ట్లాడుతూ త‌న కెరీర్ లో తొలిసారిగా ఓ బౌన్సర్ పాత్ర‌లో క‌నిపించ‌డం చాలా ఆనందంగా అనిపిస్తోంది, ఓ ఛాలెంజ్ గా తీసుకొని ఈ సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించాను. మ‌ధుర్ ద‌ర్శ‌క‌త్వంలో తొలిసారిగా న‌టించ‌డం చాలా ఉత్కంఠగా ఉంది. ఈ సినిమాతో న‌న్ను ప్రేక్షకులు మ‌రింతగా ఆద‌రిస్తార‌ని అశిస్తున్న‌ట్లుగా తెలిపారు.

Milky Beauty Tamanna As Bubbly Bouncer :

<strong>Tamanna Bhatia To Lead Madhur Bhandarkar Next Film Bubbly Bouncer</strong>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs