Advertisement
Google Ads BL

మళ్ళీ కలిసే ఛాన్స్ ఉందా?


18 ఏళ్ళ వివాహ బంధానికి విడాకుల తో ముగింపు పలికారు స్టార్ హీరో ధనుష్ రజినీకాంత్ డాటర్ ఐశ్వర్య. కాపురంలో పొరపొచ్చాలు, చిన్న చిన్న విభేదాలు సహజం. ఆ విషయంలో కాంప్రమైజ్ అయితే ఆ కాపురం సజావుగా సాగుతుంది. కాదు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటే దానికి విడాకులే పరిష్కారం చూపుతుంది. అయితే అది పెళ్ళై న రెండేళ్లకో నాలుగేళ్లకో అయితే ఓకె.. కానీ 18 ఏళ్ళ తర్వాత వారి ప్రేమకి గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా విడాకులకు దారితీస్తే అది పిల్లపై ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ధనుష్ - ఐశ్వర్యలు విడాకులు తీసుకుని వేరైనా పిల్లల కోసం కలుస్తున్నారు.

Advertisement
CJ Advs

పెద్దలు ఎంతమంది ప్యాచప్ చెయ్యడానికి ట్రై చేసినా సాధ్యం కాలేదు. కానీ ధనుష్, ఐశ్వర్య లు మాత్రం తమ పిల్లల కోసం కలుస్తున్నారు. అంటే మళ్ళీ కలిసిపోయారని కాదు.. ధనుష్, ఐశ్వర్యలు ఇద్దరూ ఎక్కువ టైం ని పిల్లలతో గడుపుతున్నారట. షూటింగ్స్ కి బ్రేక్ దొరికినప్పుడల్లా ధనుష్ పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నాడట. రీసెంట్ గా ఊటీ లో ధనుష్ తన సినిమా సెట్స్ లో కొడుకు యాత్ర తో గడిపిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమ విడాకుల ఎఫెక్ట్ వాళ్ళ మీద పడకుండా ధనుష్, ఐశ్వర్యలు చూసుకుంటున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ధనుష్ వెంకీ అట్లూరి దర్శకత్వలో సర్ మూవీలో నటిస్తున్నాడు. సర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఇంకా తమిళంలోనూ ధనుష్ ఒకటి రెండు ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్నాడు.

Dhanush bonds with son Yathra on film sets in Oot:

Dhanush is spending time with son Yathra
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs