రీసెంట్ గా రిలీజ్ అయిన కళావతి పాటతోనే రికార్డులు సెట్ చేస్తున్న మహేష్ బాబు.. సర్కారు వారి పాట సినిమా రిలీజ్ టైం కి ఇంకెన్ని అంచనాలు, ఆసక్తి క్రియేట్ చేస్తారో అని మహెష్ ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. కళావతి సాంగ్ తో మెస్మరైజ్ చేసి స్టైలిష్ లుక్స్ తో ఇరగదీసిన మహేష్ పాత్ర సర్కారు వారి పాట లో ఎలా ఉండబోతుందో అనే దానికి మహేష్ బాబు ఓ క్లూ ఇచ్చారు. పోకిరి తరహా పాత్రలో కనిపిస్తాను అని. అయితే ఇప్పుడు మహేష్ సర్కారు వారి పాట పాత్ర పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సర్కారు వారి పాటలో మహేష్ రోల్ జాలీ దయా లేని ఓ రికవరీ ఏజెంట్ గా బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులను కష్టమర్స్ నుండి వసూలు చేసే పవర్ ఫుల్ & జాయ్ ఫుల్ కేరెక్టర్ లో మహేష్ కనిపిస్తాడట. పోకిరి తర్వాత మళ్లీ అలాంటి స్పెషల్ ఆటిట్యూడ్ ఉన్న కేరెక్టరైజేషన్ లో సర్కారు వారి పాటలో కనిపించబోతున్నాడు మహేష్. అలాగే ఖలేజా తర్వాత అంత ఓపెన్ అప్ అయ్యి మాట్లాడే కేరెక్టర్ కూడా ఇదే అవ్వబోతుంది మహేష్ కి. మాస్ కి మంచి కిక్ ఇచ్చే డైలాగ్స్ చెప్పబోతున్నాడట సర్కారు వారి పాటలో. అంత బాగా మహేష్ కేరెక్టర్ ని దర్శకుడు పరశురామ్ డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది.